గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, ఫోలేట్, క్యాల్షియం, విటమిన్ బి12, బి6 వంటి పలు పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు పరిమిత కార్బోనేట్లు ఉన్న ఆహారం అవసరం. అలాంటి ఆహారాల కోవలోకే గుడ్లు కూడా వస్తాయి.
ఇంకా గుడ్లు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉండదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా గుడ్లను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పైగా గుడ్లు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే గుడ్లను తినడం మధుమేహులకు ప్రయెజనకరమే తప్ప హానికరం కాదు.
అలాగే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం మధుమేహులు రోజుకు రెండు గుడ్లు తీసుకోవచ్చు. అంటే డయాబెటిక్ పేషంట్లు గుడ్లను తినకూడదనే వాదనకు అర్ధమే లేదు.
గుడ్లను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సివిటీ పెరగడంతోపాటు శరీరానికి కావాలసిన పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి గుడ్లను మధుమేహులు కూడా తీసుకోవచ్చు.