Goat Milk: మేక పాలు తాగితే.. డెంగ్యూ తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Oct 18, 2024 | 9:04 AM

ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వేల మంది డెంగ్యూ బారినపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నవారు త్వరగా కోలుకునేందుకు సరైన ఆహారం కీలకమని చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతాయని.. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయని చెప్తున్నారు. అయితే, డెంగ్యూ బాధితులకు మేకపాలు మేలు చేస్తాయనే వార్తలు కూడా ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి చికిత్సలో మేక పాలు నిజంగా పనిచేస్తాయా..? ఈ పాలు.. డెంగ్యూని తగ్గించగలవా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

1 / 5
నిపుణుల ప్రకారం.. మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పోషకగుణాలు అధికంగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు.

2 / 5
ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మేక పాలల్లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని సక్రమంగా అందుతాయి. ఇది ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ కలిగి ఉంటుంది, దీని కారణంగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.

3 / 5
ఒక కప్పు మేక పాలు తీసుకోవడం వల్ల 30 శాతం ఫాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే బయోఆర్గానికి సోడియం శరీరానికి చాలా మేలు చేస్తుంది. కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

4 / 5
డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. వారికి మేక పాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. కానీ, డెంగ్యూ చికిత్సతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక పోషకమైన ఎంపిక, శరీరానికి అవసరమైన పోషణను అందించగలదని నిపుణులు అంటున్నారు, అయితే ఇది ప్లేట్‌లెట్లను పెంచడంలో లేదా డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని నేరుగా నియంత్రించడంలో సహాయపడదు.

5 / 5
డెంగ్యూ అనేది  డెంగ్యూ వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగీ దోమ కుట్టడం వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇక.. ఈ దోమ కుట్టిన తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూకి ఉత్తమ చికిత్స ఫ్లూయిడ్ థెరపీ అని నిపుణులు అంటున్నారు, రోగి వీలైనంత ఎక్కువ ద్రవాన్ని తీసుకోవాలి, ORS తీసుకోవాలి, ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.