
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడే తాళిని తీస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పరీక్షల సమయంలో కూడా దీనిని తెలిగించాలని ఉండేది. కానీ ఇప్పుడు పరీక్షలకు హాజరయ్యేటప్పుడు మంగళసూత్రం ధరించవచ్చు అనే నిబంధనలు వచ్చాయి. మరి అసలు ఈ నల్లపూసల దండను కొన్ని సందర్భాల్లో తీయడం మంచిదేనా? పండితులు ఏమటున్నారో తెలుసుకుందాం.

పండితులు మాట్లాడుతూ.. ఒకసారి నల్లపూసల దండను మెడలో వేశాక తియ్యకూడదంట. కానీ కొన్ని సందర్భాల్లో అంటే, అది పెరిగిపోయినప్పుడు, లేదా దానిని తీసి కొత్తద ధరించాలి అనుకున్న సమయంలో మాత్రమే తీయాలంట.

ముఖ్యంగా వివాహిత మాంగళ్యం మెడలో లేకుండా ఇంటి ప్రధాన ద్వారం దాటకూడదంటున్నారు పండితులు. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఈ నియమాలను పాటించడం లేదు కానీ, శాస్త్రల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని వారు పేర్కొన్నారు.

నగరాల్లో ఉండే కొంత మంది మంగళ సూత్రం ధరించడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ తాళి లేకుండా ఉండకూడదు. కొందరు పడుకునే సమయంలో, స్నానం చేసే సమయంలో తాళిని తీసేస్తుంటారు కానీ ఇలా కూడా చేయకూడదు అని పండితులు చెబుతున్నారు.

నల్లపూసల దండ లేదా మంగళ సూత్రం ధరించడం వలన ప్రతి కూల శక్తి నిరోధించడమే కాకుండా, ప్రతి కూల శక్తి కూడా పెరుగుతుందంట. అంతే కాకుండా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. గుండె ఆరోగ్యం బాగుండటమే కాకుండా, మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చునంట.