
యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. యోగా మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా, రోజంతా చురుకుదనంతో ఉండాలంటే.. ఇంట్లో ఈ యోగా ఆసనాలు వేస్తే మంచిదని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నౌకాసనం: ఈ ఆసనం వేయడానికి ముందుగా యోగా చాపపై కాళ్లు చాపి కూర్చోవాలి. ఆ తర్వాత మీ పాదాలను ముందుకు ఉంచి.. నడుము నిటారుగా ఉంచండి. అనంతరం చేతులను నడుకు కింద ఉంచి ఆ తర్వాత మోకాళ్లను దగ్గరకు తీసుకొని.. నమస్కారం చేయాలి. పాదాలను నిటారుగా ఉంచి చేతులను ముందుకు చాచాలి.. ఈ యోగా కొంత సేపు చేసిన తర్వాత విరామం తీసుకోవాలి.

మార్గరియాసనం - ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను, చేతులను నేలపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ మీ నడుము భాగాన్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ భుజాలను తిప్పుతూ.. నడుము భాగాన్ని కిందకు పైకి కదిలిస్తుండాలి. దీన్ని 5 సార్లు రిపీట్ చేయాలి.

తడసానం - ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడండి. ఆ తర్వాత కాలి మీద నిలబడండి. చేతులను పైకి లేపాలి. చేతుల వేళ్లను జోడించి నిటారుగా కాసేపు ఉండండి.. ఈ భంగిమలో కొంత సేపు ఉండండి.

బాలసనం - ముందుగా యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చొని .. చేతులను ముందుకి చాచాలి. ఆ తర్వాత మీ తల నేలపై తాకేలా చేయాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండి.. ఆ తర్వాత ప్రారంభ స్థానానికి తిరిగి రావాలి. ఈ భంగిమలను యోగా గురువుల సహాయం తీసుకోని చేయడం మంచిది.

అయితే.. ఈ యోగసనాలు వేసే ముందుకు యోగా గురువులను సంప్రదించి చేయడం మంచిది.