
మజ్జిగలో ఇంగువ కలుపుకుని తాగితే జీర్ణక్రియకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలుపుకుని తాగితే గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పరగడుపున మజ్జిగ తాగితే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంగువ కలిపితే మరింత ఉపయోగం. ఇంగువ కలిపి తాగితే చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్లాసు మజ్జిగలో 50-80 కేలరీలు ఉంటాయి. నెమ్మదిగా కరగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. మజ్జిగలో ప్రో బయోటిక్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

Butter Milk Hing

మజ్జిగలోని లాక్టోస్ కొంతమందికి అలర్జీలు, జీర్ణ సమస్యలకి కారణమవుతుంది. దీని వల్ల కొంతమందికి కడుపునొప్పి, విరోచనాలు, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, విరోచనాలను తగ్గించడానికి కొద్దిగా ఇంగువ కలిపి తీసుకుంటే మంచిది. మెరుగైన జీర్ణక్రియతో పాటు ఆరోగ్యం బాగుంటుంది.

ఇంగువ కలిపిన మజ్జిగ తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అనారోగ్యకర ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు. ఈ కారణంగానే బరువు తగ్గుతారు. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మహిళల్లో పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి, తిమ్మిరి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలుంటే దీర్ఘకాలిక వ్యాధుల మందులు తీసుుకునేవాళ్లు మజ్జిగ ఇంగువ తాగకూడదు.