
Yamaha FZ25: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తాజాగా కొత్త బైక్‌ను విడుదల చేసింది. తన పాపులర్ఎఫ్జెడ్25 మోడల్‌లో మాన్స్టర్ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్ తీసుకొచ్చింది. ఈ మోడల్‌ను భారత మార్కెట్లో రూ.1,36,800 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదల చేసింది. అయితే ప్రామాణిక FZ25 మోడల్‌తో పోలిస్తే ఈ మోడల్‌కు అదనంగా రూ. 2,000 ఖర్చు అవుతుంది. కాల్ ఆఫ్ ది బ్లూ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ బైక్‌ను విడుదల చేసినట్లు యమహా ఇండియా స్పష్టం చేసింది.

యమహా ఇండియా నుంచి వచ్చిన ఈ బైక్పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మోటోజిపి వేరియంట్‌లో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ను చేర్చింది. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిలో 249 సీసీ ఎయిర్‌కూల్డ్, ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ఇంజిన్ను పొందుపర్చింది.

యమహా ఎఫ్‌జెడ్ 25 మాన్స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్‌ను బ్లాక్ బేస్ కలర్‌లో అందిస్తున్నారు. ఇక, దీని హెడ్‌ల్యాంప్ కౌల్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ బ్లూ పెయింట్‌తో వస్తాయి. కొత్త యమహా బైక్‌లో కొన్ని కాస్మోటిక్ మార్పు చేర్పులు చేశారు. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి ఎడిషన్ ప్రామాణిక మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టాకోమీటర్, స్పీడ్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, చెక్ ఇంజన్ ఇండికేటర్, ఓడోమీటర్ మొదలైన అన్ని అవసరమైన రీడౌట్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లను అందించారు.

యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి ఎడిషన్ 249 సీసీ కలిగి ఉంటుంది.ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 20.5 బిహెచ్‌పి, 20 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్‌లో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, 7 దశల్లో సర్దుబాటు చేయగల మోనో-షాక్‌లను అందించింది.