
Yamaha Special Offers: బైక్ ప్రియులకు యమహా ఇండియా మోటార్ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్ సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్‌లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది.

యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, యమహా ఫాసినో 125ఎఫ్‌ఐ వాహనాలపై ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఇటీవల యమహా ఇండియా విడుదల చేసిన ఐబ్రిడ్ వెర్షన్ టూవీలర్స్ ఫాసినో 125ఎఫ్‌ఐ, రెడ్‌జేఆర్ 125ఎఫ్‌ఐ వాహనాలపై తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో వివిధ ఆఫర్లను పొందవచ్చు.

తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ (నాన్ ఐబ్రిడ్),యమహా రేజడ్ఆర్ ఎఫ్‌ఐ(నాన్ ఐబ్రిడ్)వెర్షన్ వెహికల్స్ పై రూ.3,786 ఇన్సూరెన్స్ బెన్‌ఫిట్స్, అలాగే రూ.999కే లోడౌన్ పేమెంట్స్ తో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను కూడా పొందవచ్చు.

ఇక తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయలను పొందడమే కాకుండా.. ఇన్య్సూరెన్స్ బెన్‌ఫిట్‌కింద రూ.3,876, రూ.999కే డౌన్ పేమెంట్, రూ .2,999 విలువైన బహుమతులను అందజేస్తున్నట్లు యమహా ఇండియా ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.