Xiaomi Mi 11: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఏప్రిల్ 23న తన ఎంఐ 11 అల్ట్రాను భారత్ మార్కెట్లో విడుదల చేయబోతోంది. షియోమి ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ఐ, ఎంఐ 11 లైట్ సహా మొత్తం ఐదు రకాల మొబైళ్లు విడుదల కానున్నాయి. ఎంఐ 11 అల్ట్రా 5జీ కనెక్టివిటీతో పాటు ఏఐ, గేమింగ్, అద్భుతమైన కెమెరా పనితీరు తదితర అద్భుతమైన ఫీచర్స్ తీసుకువచ్చింది. కొత్తగా రాబోయే ఈ ఫోన్‌లలో 11 స్నాప్‌డ్రాగన్ 888 SoCతో పనిచేసే మొదటి డివైజ్ అని షియోమి చెప్పుకొచ్చింది. ఇది వివిధ హార్డ్కోర్ టెక్నాలజీలతో లోడ్ అయి వస్తుందని కంపెనీ తెలిపింది.