WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం..!

| Edited By: Phani CH

Oct 01, 2021 | 9:17 AM

WhatsApp: వాట్సాప్‌ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా..

1 / 5
WhatsApp: వాట్సాప్‌ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ జరుపుకొనే అవకాశం కల్పించిన వాట్సాప్.. వినియోగదారులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఛాట్ కంపోజర్‌లో రూపీ గుర్తును అందుబాటులోకి తీసుకువచ్చింది.

2 / 5
కంపోజర్‌లో కెమెరా ఐకాన్ ద్వారా ఇకపై ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చని.. దీని ద్వారా దేశంలోని 2 కోట్ల స్టోర్లలో ఎక్కడైనా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. దీని ద్వారా వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. వాట్సాప్ తీసుకొచ్చిన రూపీ సింబల్.. మరికొద్ది రోజుల్లోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

3 / 5
వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం చేయాలన్నదే తమ లక్ష్యమని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో వాట్సాప్ పేమెంట్స్ విభాగం డైరెక్టర్ మనేష్ మహాత్మ తెలిపారు.

4 / 5
వాట్సాప్‌ను ప్రతి రోజూ మిలియన్ల సంఖ్యలో వినియోగదారులు వాడుతుంటారని.. ఎన్నో నిమిషాలు యాప్‌పై ఉంటారని అన్నారు. డిజిటల్ నగదు లావాదేవీలను వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపినంత సులభతరమైన ప్రక్రియగా మార్చాలన్నది తమ అభిమతమని మనేష్ మహాత్మ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో భారత్ ఎంతో ముందుందని తెలిపారు.

5 / 5
అయితే ఈ విషయంలో దేశం ఆరంభంలోనే ఉందని పేర్కొన్నారు. దేశంలోని సుమారు 80 శాతం మంది వినియోగదారుల లావాదేవీలు ఇంకా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, భారత్‌లో మూడింట రెండింతల ప్రాంతం ఇంకా గ్రామీణంలోనే ఉందని.. రాబోయే రోజుల్లో డిజిటిల్ ఇన్నోవేషన్ ప్రయోజనాలు చూస్తామని అన్నారు.