ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలు. V1 ప్రోతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 30 వేలు తక్కువకు లభిస్తోంది. దేశంలో ఇది ఓలా, ఏథర్, TVS, బజాజ్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతోంది. హీరో విడా వి1 ప్లస్ కంటే ముందు ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ అర్బనే లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌లో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మరి వీటిల్లో ఏది చౌకైనది.? దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు చూద్దాం.