Top Schools: భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 స్కూల్స్.. ఫీజు ఎంతో తెలిస్తే షాకవుతారు!

|

Oct 07, 2024 | 3:46 PM

భారతదేశంలోని పాఠశాల విద్యార్థుల కోసం అన్ని శిక్షా అభియాన్ అమలు అవుతోంది. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ విద్య ఉచితం. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు వింటే సామాన్యులు షాక్ అవుతారు. దేశంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన పాఠశాలలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1 / 5
సింధియా స్కూల్ అనేది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న బాలుర కోసం ఒక ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల. ఈ పాఠశాల 1897లో చారిత్రాత్మకమైన గ్వాలియర్ కోటలో ప్రారంభమైంది. ఈ పాఠశాల భారత రాచరిక రాష్ట్రాల రాజుల పిల్లల కోసం ప్రారంభించారు. ఆ పాఠశాల వార్షిక ఫీజు 13 లక్షల 50 వేల రూపాయలు.

2 / 5
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డూన్ స్కూల్ 1935లో ప్రారంభించారు. ఇది బాలుర కోసం ఒక ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల. మీడియా కథనాల ప్రకారం, ఈ పాఠశాల వార్షిక ఫీజు 10 లక్షల 25 వేల రూపాయలు. టర్మ్ ఫీజు 25 వేల రూపాయలు.

3 / 5
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని మాయో స్కూల్ కూడా బాలుర కోసం ఒక బోర్డింగ్ స్కూల్. ఇది 1875లో స్థాపించారు. మీడియా కథనాల ప్రకారం, ఎన్నారై విద్యార్థుల పాఠశాల ఫీజు సంవత్సరానికి రూ. 13 లక్షలు. కాగా భారతీయ విద్యార్థులకు ఏడాదికి 6 లక్షల 50 వేల రూపాయల ఫీజు ఉంటుంది.

4 / 5
ముంబైలోని జుహులో ఉన్న ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్ అంతర్జాతీయ స్థాయి పాఠశాల. ఈ పాఠశాల 2004లో ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం, ఈ పాఠశాల వార్షిక రుసుము 9 లక్షల 90 వేల రూపాయలు. సీనియర్ సెక్షన్ ఫీజు 10 లక్షల 90 వేల రూపాయలు.

5 / 5
వెల్హామ్ బాలుర పాఠశాల ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని ఒక బోర్డింగ్ పాఠశాల. ఈ పాఠశాల 1937లో స్థాపించారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ పాఠశాల వార్షిక ఫీజు 5 లక్షల 70 వేల రూపాయలు.