Bank Education loans: ఉన్నత విద్య రుణాలకు పెరుగుతున్న ఆదరణ.. ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీ..!

|

Apr 06, 2021 | 8:19 AM

Bank Education loans: ప్రస్తుతం విద్య కోసం లక్షల్లో ఖర్చు అవుతుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు సంపాదించింది ఎక్కువగా విద్య కోసమే ఖర్చు చేయాల్సి...

1 / 5
Bank Education loans: ప్రస్తుతం విద్య కోసం లక్షల్లో ఖర్చు అవుతుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు సంపాదించింది ఎక్కువగా విద్య కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, ఇతర కారణాలతో ఉన్నత విద్యకు కేటాయించాల్సిన మొత్తం వార్షిక ఆదాయంలో 13 శాతం వరకు ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే తేల్చింది.

2 / 5
 ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్‌ రుణాలు ఇస్తున్నాయి. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి బ్యాంకులు వరుసగా 6.8 శాతం, 6.85 శాతం వడ్డీతో విద్యారుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది పది శాతం వరకు ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు 9.55 శాతం, 9.70శాతం, 10.50 శాతం వడ్డీ విధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అతి తక్కువగా 6.8 శాతంతో ఎడ్యుకేషన్‌ లోన్లు ఇస్తుండగా, ఇండియన్‌ బ్యాంకు అత్యధికంగా 7.15 శాతం వడ్డీ అందిస్తోంది.

3 / 5
కాగా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో రెండు శాతం వరకు తేడాలు ఉన్నాయి. ఈ కారణంగా వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులను ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం ఎంచుకోవాలి. పర్సనల్‌ లోన్లు, విద్యారుణాల కాలపరిమితిలో (లోన్‌ టెన్యూర్‌) తేడాలు ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్లు తీసుకునేవారికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది.

4 / 5
కానీ ఎడ్యుకేషన్‌ లోన్లకు అత్యధికంగా 15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్లను ఎంచుకుంటున్నారు.

5 / 5
కాగా, ఎడ్యుకేషన్‌ రుణాలపై చెల్లించే వడ్డీకి ట్యాక్స్‌ మినహాయింపు కూడా ఉంటుంది. లోన్‌ తిరిగి చెల్లించడం ప్రారంభించిన ఏడాది నుంచి 8 ఏళ్ల వరకు మాత్రమే లభిస్తుంది. అందుకే రుణాలు తీసుకున్న వారు ఎనిమిదేళ్లుగా గడువు పెట్టుకుంటే ట్యాక్స్‌ మినహాయింపుల ద్వారా ఎక్కువ లబ్ది పొందవచ్చు.