Top Fuel Efficient Bikes: తక్కువ ధరలో సూపర్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే.. లీటర్‌పై 80కి.మీ.

| Edited By: Ram Naramaneni

Oct 19, 2023 | 6:47 PM

మన దేశంలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తున్నామంటే ముందు గుర్తొచ్చేది మైలేజీ. ఎంత మైలేజీ ఇస్తుందని సాధారణంగా మన వాళ్లు ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ మైలేజీకి అంత ప్రాధాన్యం ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ధరలు కూడా బండి ఇచ్చే మైలేజీకి అధిక ప్రాధాన్యమిచ్చేలా చేస్తున్నాయి. అదే సమయంలో బండి ధర కూడా ప్రాముఖ్యమైనదే. ఈ నేపథ్యంలో అనువైన బడ్జెట్లో మంచి మైలేజీ ఇచ్చే బైక్ ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఇలాంటి ఆలోచనలతోనే మీరూ ఉంటే ఈ కథనం మిస్ అవ్వకండి. రూ. లక్షలోపు బడ్జెట్లో అధిక మైలేజీ ఇచ్చే బైక్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ బైక్ లు, వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 6
స్ప్లెండర్ ప్లస్.. దాదాపు 30 సంవత్సరాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ ఇది. మన దేశంలో అత్యంత విజయవంతమైన మోటార్‌సైకిళ్లలో ఇదీ ఒకటి. ప్రస్తుత తరం బైక్ 97.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్సీఇంజిన్‌తో వస్తున్నాయి. ఇది 7.91 బీహెచ్పీ, 8.05ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక లీటర్ పై 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ ధర రూ. 71,586 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

2 / 6
బజాజ్ ప్లాటినా 100.. మన దేశీయ మార్కెట్ల ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా బజాజ్ దీనిని విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీఎస్6 కంప్లైంట్ లో ఎల్ఈడీ డీఆర్ఎల్, మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించే కంఫోర్టెక్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ లో 7.79 బీహెచ్‌పీ, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 102 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. ఇది లీటర్ పై 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 65,856 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

3 / 6
టీవీఎస్ స్పోర్ట్.. ఈ మోటార్ సైకిల్ లీటర్ పెట్రోల్ పై 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 7350 ఆర్బీఎం వద్ద 8.29 బీహెచ్‌పీ, 4500 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 109 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ కిక్ స్టార్ట్ వేరియంట్‌లో రూ. 64,050, సెల్ఫ్-స్టార్ట్ వేరియంట్ ధర రూ. 70,223 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కి అందుబాటులో ఉంది.

4 / 6
హోండా షైన్..  మన దేశంలో అత్యంత విజయవంతమైన బైక్ లలో ఇదీ ఒకటి. ఈ బైక్ 123.9 సీసీ ఇంజన్‌తో 10.59 బీహెచ్‌పీ, 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది లీటర్ పై 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ధర డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ. 78,687, డిస్క్ బ్రేక్ వేరియంట్ కోసం రూ. 82,687 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

5 / 6
టీవీఎస్ రేడియాన్.. దీనిలో ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనిలో గడియారం, సర్వీస్ ఇండికేటర్, తక్కువ బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్ , యావరేజ్ స్పీడ్ వంటి సమాచారాన్నిచూపిస్తుంది. ఈ బైక్ ఇంటెల్లిగో సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇది ఎక్కువసేపు పనిలేకుండా ఉన్నప్పుడు సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఈ బైక్ లో 109.7సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్  ఉంటుంది. 7,000 ఆర్పీఎం వద్ద 8 బీహెచ్పీ. 5,000 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ కు 65-70 మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ బేస్ ఎడిషన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 60,925, డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 74 834, డిజి డిస్క్ వేరియంట్ రూ. 78 834. (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

6 / 6
బజాజ్ సీటీ110.. అధిక ఇంధన సామర్థ్యం కారణంగా ఈ బైక్ మన భారతీయ మార్కెట్లో విజయవంతమైంది. దీనిలో 8.48 బీహెచ్పీ, 9.81 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 115 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటర్ పై 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ. 67,322 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.