
గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రాక్ స్కూటర్.. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిలో 10 అంగుళాల చక్రాలు ఉంటాయి. గంటలకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 60V 23AH సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. సింగిల్ చార్జ్ పై 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిపై అమెజాన్లో 53శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్కూటర్ ధర 44,999గా ఉంది.

ఈఓఎక్స్ కొత్త ఈ2 ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో ఈ స్కూటర్ పై 48శాతం తగ్గింపు లభిస్తోంది. 32AH 60V సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై 60 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్, రిమోట్ కీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. 10 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. దీనిలో ఎకో, స్పోర్ట్, హై అనే మోడళ్లు ఉన్నాయి. దీని ధర రూ. 51,999గా ఉంది.

కోమకీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-వన్.. అమెజాన్ డీల్స్ లో దీనిపై 26శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలోని బ్యాటరీ 1.75కేడబ్ల్యూ సామర్థ్యంతో ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. దీనికి ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. ముందు వైపు డిస్క్ బ్రేకులు. దీని ధర రూ. 51,999గా ఉంది.

ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ స్కూటర్ పై అమెజాన్లో 51శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. స్లీక్ డిజైన్ ఉంటుంది. యూఎస్బీ చార్జింగ్ పోర్టు ఉంటుంది. హై రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. డీఆర్ఎల్ ల్యాంప్స్ ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 60కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది.

బజాజ్ చేతక్ ప్రీమియం 2024.. ఇది మన దేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. అధిక సామర్థ్యం కలిగిన 4.2కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 127కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గంటలకు 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 80శాతం చార్జింగ్ కేవలం మూడు గంటల 15నిమిషాల్లోనే ఎక్కుతుంది. దీనిపై 6శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ స్కూటర్ ను మీరు అమెజాన్లో రూ. 1,38,990కి కొనుగోలు చేయొచ్చు.