బీవైడీ ఈ6.. గ్లోబల్ వైడ్ గా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు చెమటలు పట్టిస్తున్న చైనా ఈవీ బ్రాండ్ బీవైడీ. ఈ కంపెనీ నుంచి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీని కొత్త అవతార్ లో లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. దీనిలో డిజైన్ అప్డేట్లతో పాటు, కొత్త ఈ6 పెద్ద 12.8- అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, మరిన్నింటిని పొందే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద 71.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఒకే చార్జ్ తో దాదాపు 530 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 204 బీహెచ్పీ, 310ఎన్ఎం టార్క్ అవుట్ పుట్ ను అందిస్తుంది. అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.