Credit Card Loan: క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

|

Aug 20, 2024 | 12:07 PM

ఇటీవల కాలంలో రుణాలు చాలా ఈజీగా మంజూరవుతున్నాయి. మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే చాలు.. బ్యాంకింగ్ సంస్థలే పిలిచిమరీ లోన్లు ఇస్తున్నాయి. అదే సమయంలో క్రెడిట్ కార్డుల ఆధారంగా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ ద్వారా ఏదో ఒక సంస్థ ఆధ్వర్యంలోని క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. దానిని సక్రమంగా నిర్వహించడం ద్వారా రుణాలు దాని నుంచి పొందుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఎన్‌క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్బీఐ కార్డు యాప్‌లోనే అది చూపిస్తుంది. మీ ఆదాయం, కార్డు వినియోగం, బిల్లుల చెల్లింపుల ఆధారంగా వీటిని అందిస్తుంది. ఇలాగే అన్ని బ్యాంకులు కూడా అందిస్తాయి. అయితే ఇవి తీసుకునే సమయంలో కొన్ని అంశాలను తప్పక పరిశీలించాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

1 / 5
వడ్డీ రేటు.. క్రెడిట్ కార్డుపై రుణాలు తీసుకునే సమయంలో వడ్డీ రేటును ప్రాథమికంగా తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా ఈ వడ్డీ రేట్లు పర్సనల్ లోన్లకు వర్తించే విధంగానే ఉంటాయి. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. వీటిని సరిచూసుకొని, తక్కువ వడ్డీ అవకాశాలున్న కార్డులపైనే లోన్లు తీసుకోవాలి.

2 / 5
ప్రాసెసింగ్ ఫీజులు.. క్రెడిట్ కార్డుపై రుణాలకు బ్యాంకులు ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తాయి. ఇవి ఎంత అనేది ఆ బ్యాంకును బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్లపై ఈ చార్జీలు ఒకశాతం నుంచి ఐదు శాతం మధ్య ఉంటాయి.

3 / 5
కాలపరిమితి.. ఈ క్రెడిట్ కార్డు రుణాలు వినియోగదారులకు ఫ్లెక్సిబులిటీని అందిస్తాయి. మీకు నచ్చిన విధంగా రుణం తిరిగి చెల్లించే కాలపరిమితిని ఎంచుకోవచ్చు. కనీసం ఆరు నెలల నుంచి 24 నెలలు, 36 నెలల వరకూ కాలపరిమితిని అందిస్తాయి. మీ వెసులుబాటును బట్టి, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

4 / 5
ప్రీ పేమెంట్.. ఈ రుణాలకు ఉన్న వెసులుబాటు ఏంటంటే వీటిని ముందస్తుగానే క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కొంత లాక్ ఇన్ పీరియడ్ దాటిన తర్వాత వాటిని ప్రీ పేమెంట్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు మాత్రం ముందస్లు చెల్లింపు చార్జీలను వసూలు చేస్తాయి.

5 / 5
ఈఎంఐ చెల్లించకపోతే.. మీరు క్రెడిట్ కార్డుపై రుణానికి సంబంధించిన ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోతే డిఫాల్టర్ గా మారతారు. అప్పుడు అది మీ క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది భవిష్యత్తులో రుణాలు రాకుండా చేస్తుంది. టాప్ అప్ రుణాలు తీసుకునే అవకాశం కూడా ఉండదు.