Best Mileage Scooters: అత్యధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవి.. టాప్‌లో ఏముందంటే..

|

Aug 13, 2024 | 5:56 PM

మన దేశంలో బండి మైలేజీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే ముందే అది ఇచ్చే మైలేజీ గురించి అడిగి తెలుసుకోవడం ఇక్కడ వినియోగదారులకు అలవాటు. గత రెండేళ్లుగా మన దేశంలో టూ వీలర్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. టూ వీలర్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బళ్లల్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు అందుబాటులోకి రావడం, మహిళా వినియోగదారులు ఎక్కువడం కూడా టూ వీలర్ మార్కెట్ పెరగడానికి కారణం. ప్రధానంగా స్కూటర్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇవి సిటీ పరిధిలో ట్రాఫిక్ సమయంలో డ్రైవింగ్ సులభతరం చేయడంతో పాటు మహిళా వినియోగదారులకు బాగా ప్రయోజనకరంగా ఉంటోంది. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక మైలేజీని అందించే బెస్ట్ స్కూటర్లకు మీకు పరిచయం చేస్తున్నాం.

1 / 5
యమహా ఫాసినో 125ఫై హైబ్రిడ్.. ఈ స్కూటర్లో 125సీసీ ఇంజిన్ ఉంటుంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్స్ వల్ల లీటర్ కు 68కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది భారత దేశంలోనే స్కూటర్ల శ్రేణిలో అత్యధికం. దీని ధర రూ. 79,900(ఎక్స్ షోరూం) ఉంది. దీని బరువు కూడా కేవలం 99కేజీలే ఉంటుంది.

2 / 5
హోండా యాక్టివా 6జీ.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ సిరీస్ లలో యాక్టివా సిరీస్ ఒకటి. ఇది టూ వీలర్ మార్కెట్లో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే దీని కన్నా ముందు హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 లీటర్ పై 67 కిలోమీటర్ల మైలేజీని అందించేది. అయితే ఈ బండిని డిస్ కంటిన్యూ చేయడంతో హోండా యాక్టివా సెకండ్ పొజిషన్లోకి వెళ్లింది.

3 / 5
టీవీఎస్ జుపిటర్ 125.. దేశీయ బ్రాండ్లలో మంచి పేరున్నది ఈ టీవీఎస్. అయితే యాక్టివాకు ఉన్నంత సేల్స్ దీనికి ఉండవు. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సీటు కింద ఎక్కువ స్థలం ఉంటుంది. బండి డిజైన్ స్టైలిష్ గా ఉంటుంది. రైడర్ కు సౌకర్యవంతంగా ఉంటుంది.

4 / 5
సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ 125.. ఈ బండి కూడా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే మైలేజీ విషయంలో కాస్త వెనుకబడింది. కేవలం లీటర్ పెట్రోల్ పై 50 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే అందిస్తుంది. ఎక్కువ పొడవుగా ఉండే స్కూటర్లలో ఇది ఒకటి.

5 / 5
టీవీఎస్ ఎన్‌టార్క్ 125.. ఇది స్పోర్టీ లుక్లో ఉండే స్కూటర్. ఇది లీటర్ పై 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిలో స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, పెప్పీ ఇంజిన్ స్పోర్ట్స్ పనితీరుని అందిస్తాయి.