Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..! ధర తక్కువ.. పని ఎక్కువ..

|

Sep 10, 2024 | 8:54 PM

నేడు ప్రతి ఇంటిలోనూ వాక్యూమ్ క్లీనర్లు దర్శనమిస్తున్నాయి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో ఇవి కీలకంగా మారాయి. ప్రతి మూలకు వెళ్లి దుమ్ము, చెత్తను తొలగించి, ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడతాయి. పని విషయంలో మనకు పూర్తి సహాయం అందించే వాక్యూమ్ క్లీనర్లు మార్కెట్ లో అనేకం లభిస్తున్నాయి. అయితే ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో అత్యంత తగ్గింపు ధరలకే రోబో వాక్యూమ్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ మోడళ్లపై దాదాపు 63 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే నోక్యాస్ట్ ఈఎంఐ సౌకర్యం, బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తున్నారు. ఇంటి కోసం మంచి వాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్ లో అందుబాటులో ఉన్న రోబో వాక్యూమ్ క్లీనర్ల ధరలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

1 / 5
అగారో ఆల్పా రోబోట్.. అగారో ఆల్పా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేలను శుభ్రం చేసుకోవడంతో పాటు బ్రష్, తుడుపు కర్రగా కూడా వాడుకోవచ్చు. ఆటోమేటిక్ క్లీనింగ్, రీఛార్జ్ చేయగల బ్యాటరీ, యాప్ కంట్రోల్, లైడార్ నావిగేషన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మీ ఇంట్లో అన్ని రకాలుగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తేలికగా ఉంటే ఈ వాక్యూమ్ క్లీనర్ పై అమెజాన్ లో 59 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ. 22,499 చెల్లించి దీన్ని సొంత చేసుకోవచ్చు.

2 / 5
ఈకోవేక్స్ డీబోట్ వై1 ప్రో.. అధునాతన క్లీనింగ్ టెక్నాలజీ కలిగిన ఈకోవాస్ డీబోట్ వై1 ప్రో  టు ఇన్ వన్ రోబో వాక్యూమ్ క్లీనర్ మీ ఇంటిలోని పలకలు, పాలరాయి, కలప, తివాచీలపై ధూళి, ఇతర వ్యర్థాలను సులభంగా శుభ్రం చేస్తుంది. దీనిలోని 5200 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జి చేసి 3500 చదరపు అడుగుల కంటే ఎక్కువ నేలను శుభ్రం చేయవచ్చు. అధునాతన నావిగేషన్ టెక్నాలజీ, యాప్ కంట్రోల్ ఫీచర్‌ దీని అదనపు ప్రత్యేకతలు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అమెజాన్ లో 59 శాతం తగ్గింపుపై రూ. 29,899కు అందుబాటులో ఉంది. నెలకు రూ. 1,450 చొప్పున చెల్లించేలా ఈఎంఐ విధానంలోనూ తీసుకోవచ్చు.

3 / 5
ఐలైఫ్ వీ3ఎక్స్.. ఐలైఫ్ వీ3ఎక్స్ వాక్యూమ్ క్లీనర్ 26 శాతం తగ్గింపుపై అమెజాన్ లో అందుబాాటులో ఉంది. నేల, కార్పెట్లుపై ఉండే దుమ్ము, ధూళి, చెత్తతో పాటు జంతువుల జుత్తును కూడా సులువుగా శుభ్రం చేస్తుంది. దీనిలో యాప్ కంట్రోల్ ఫీచర్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నుంచే క్లీనింగ్ షెడ్యూల్‌, సెట్టింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లి చెత్తను తొలగిస్తుంది. క్రెడిట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి దీన్ని కొనుగోలు చేసినప్పుడు ఆఫర్లు లభిస్తాయి. వాటి ద్వారా దాదాపు రూ. 1,750 వరకూ ఆదా చేసుకోవచ్చు. ఐలైఫ్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ రూ.15,900కు అందుబాటులో ఉంది.

4 / 5
ఎంఐ రోబో వాక్యూమ్.. ఇంటిలోని టైల్స్, పాలరాయి, కలప ఉపరితలాలను చాలా సులువుగా శుభ్రం చేస్తుంది. దీనిలోని లేజర్ సెన్సాలతో పనిచాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఇంటి చుట్టూ ఉన్న మూలలను తాకకుండా నావిగేట్ చేస్తుంది. 240 నిమిషాల రన్ టైమ్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా శుభ్రపరిచే సెషన్లను షెడ్యూల్ చేయవచ్చు. దీనిలోని లిథియం-అయాన్ బ్యాటరీ దీర్ఘకాల మన్నిక కలిగి ఉంటుంది. అమెజాన్ లో ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.27,999కు అందుబాటులో ఉంది. నెలకు రూ.1,357 చొప్పున ఈఎంఐ చెల్లించేలా కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

5 / 5
ఈకోవేక్స్ డీబోట్ వై1.. స్మార్ట్ మ్యాపింగ్ టెక్నాలజీ కలిగిన ఈకోవేక్స్ డీబోట్ వై1  రోబో వాక్యూమ్ క్లీనర్ మీ ఇంటిలోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేస్తుంది. ధూళి, వ్యర్థ కణాలు, ఇతర చెత్తను మనకు కనబడనివ్వదు. తక్కువ సమయంలో ఇంటిని మెరిసేలా చేస్తుంది. నలుపు డిజైన్ లో ఆకట్టుకునే ఈ వాక్యూమ్ క్లీనర్ ను చాలా ఈజీగా ఇంటిలో భద్రపర్చవచ్చు. 5200 ఎంఏహెచ్ లిథియం బ్యాటరీ, అధునాతన నావిగేషన్ సాంకేతికత కలిగిన ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.29,899కు అందుబాటులో ఉంది.