Upcoming E-Scooters: కొత్త సంవత్సరం.. కొత్త స్కూటర్లు.. క్యూ కడుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు

| Edited By: Janardhan Veluru

Jan 08, 2024 | 6:26 PM

కొత్త సంవత్సరం ఆరంభమైంది. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ప్రజలు ముందుకు వెళ్తున్నారు. చాలా మందికి కొత్త ఏడాదిలో ఓ కొత్త బైక్ కొనుగోలు చేయాలనిన భావిస్తుంటారు. మీరు అలాంటి ఆలోచనలతో ఉంటే ఈ కథనం మిస్ అవ్వొద్దు. గతేడాది అంటే 2023లో ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అయ్యాయి. అన్ని బ్రాండ్లకు చెందిన వాహనాలు కూడా బాగానే అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అంతకు మించిన డిమాండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉంటుందన్న ఆలోచనలతో అందరూ కంపెనీలు పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులు లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు క్యూ కట్టనున్నాయి. అలా ఏడాది మార్కెట్లో అడుగు పెట్టనున్న టాప్ బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్..
గొగోరో తన బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడంతో పాటు బీ2బీ అమ్మకాల కోసం ' క్రాస్‌ఓవర్ ఇ-స్కూటర్ శ్రేణి'ని ప్రదర్శించింది . తైవానీస్ తయారీదారు 2024 రెండవ త్రైమాసికం నాటికి దాని స్కూటర్ శ్రేణిని సాధారణ వినియోగదారులకు (బీ2సీ) అందించాలని యోచిస్తోంది. ఈ కంపెనీ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రధానం స్వాపింగ్ బ్యాటరీతో వినియోగదారులకు అదనపు సౌలభ్యం లభిస్తోంది.

గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్.. గొగోరో తన బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడంతో పాటు బీ2బీ అమ్మకాల కోసం ' క్రాస్‌ఓవర్ ఇ-స్కూటర్ శ్రేణి'ని ప్రదర్శించింది . తైవానీస్ తయారీదారు 2024 రెండవ త్రైమాసికం నాటికి దాని స్కూటర్ శ్రేణిని సాధారణ వినియోగదారులకు (బీ2సీ) అందించాలని యోచిస్తోంది. ఈ కంపెనీ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రధానం స్వాపింగ్ బ్యాటరీతో వినియోగదారులకు అదనపు సౌలభ్యం లభిస్తోంది.

2 / 5
హోండా యాక్టివా ఎలక్ట్రిక్.. పెట్రోల్ ఇంజిన్ యాక్టివా దేశంలో తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశంలో అత్యధికంగా విక్రయిస్తున్న స్కూటర్ యాక్టివానే. ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ పేరుతో ఒకటి రెండు నెలల్లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది లాంచ్ అయితే మార్కెట్లో ఇప్పటికే ఉన్న అన్ని బ్రాండ్ల స్కూటర్లకు పోటీ తప్పదు.

3 / 5
సుజుకి బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్.. బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2023 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించింది. ఈ స్కూటర్ బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 ఆధారంగా రూపొందింది . ఇది 2021లో భారతదేశంలో ని రోడ్లపై పలు పరీక్షలకు లోనైంది. అయితే లాంచింగ్ జరగలేదు. ఎట్టకేలకు 2024లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ అనేది సుజుకి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 1.2-1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

4 / 5
ఏథర్ ఫ్యామిలీ/కమ్యూటర్ స్కూటర్.. ట్విట్టర్‌లో ఏథర్ ఎనర్జీ సీఈఓ కూడా ఏథర్ కుటుంబ దృష్టితో కూడిన స్కూటర్ ను తీసుకొస్తున్న  ధ్రువీకరించారు. ఏథర్ ఫ్యామిలీ స్కూటర్ ఇటీవల బాక్సీ డిజైన్, ప్రత్యేకమైన కామో ర్యాప్‌తో  రోడ్లపై పరీక్ష చేస్తుండగా దర్శనమిచ్చింది. ఇప్పటికే ఏథర్ 450 అపెక్స్ ను లాంచ్ చేయగా.. ఈ ఫ్యామిలీ స్కూటర్  2024లో విడుదల కానుంది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది .

5 / 5
అప్ డేటెడ్ హీరో విడా వీ1 ప్రో.. హీరో మోటోకార్ప్ నుంచి ఈ కొత్త సంవత్సరంలో ఓ కొత్త అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. విడా వీ1 ప్రోలో కొన్ని మార్పులు చేసి రీలాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నావిగేషన్ ను కొత్తగా తీసుకొస్తున్నారు. అలాగే బ్యాటరీ ప్యాక్ లో  కూడా కొన్ని అప్ డేట్లు తీసుకొస్తున్నారు. 110కిలోమీటర్ల కంటే అధికమైన రేంజ్ ఇది ఇస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త వెర్షన్ స్కూటరఱ్ ధర రూ. 1,25,900 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, ఫేమ్ 2 సబ్సిడీతో సహా) ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటి కే ఉన్న వీడా వీ1 ప్రో కంటే దాదాపు రూ. 15,000 ఎక్కువ.