
ఉత్తమ స్పోర్టీ కమ్యూటర్ మోటారు సైకిళ్లలో హోండా హార్నెట్ 2.0 ముందు వరుసలో ఉంది. దీనిలోని 184 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 17 హెచ్ పీ, 15.9 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో ఐదు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ కు కనెక్ట్ అవుతుంది. ముందు యూఎస్ డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. లీటర్ పెట్రోలుకు సుమారు 43 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ రూ.1.40 లక్షల(ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది.

కేటీఎం 200 డ్యూక్ బైక్ లోని 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ నుంచి 24 హెచ్ పీ, 19.3 గరిష్ట్ టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇంజిన్ కు ఆరు స్పీడ్ ట్రాన్స్ మిషన్ జత చేశారు. పైన తెలిపిన బైక్ ల మాదిరిగానే యూఎస్ బీ ఫోెర్కులు, మోనోషాక్ సెటప్, డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ బాగున్నాయి. ఈ బైక్ లీటర్ పెట్రోలుకు సుమారు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.1.98 లక్షలు.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ లోని సింగిల్ సిలిండర్ 197.8 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ నుంచి 20 హెచ్ పీ, 17.25 గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సెటప్, ముందు వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలు. ఈ బైక్ సుమారు 42 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మన దేశంలో రూ.1.48 లక్షల (ఎక్స్ షోరూమ్)కు లభిస్తోంది.

ఆధునిక ఫీచర్లతో పల్సర్ ఎన్ ఎస్ 200 మోటారు సైకిల్ అందుబాటులోకి వచ్చింది. దీనిలోని 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ నుంచి 24 హెచ్ పీ, 18.74 గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది. ముందు యూఎస్ డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంజిన్ కు ఆరు స్పీడ్ గేర్ బాక్స్ అనుసంధానం చేశారు. సుమారు 41 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ ను రూ.1.54 లక్షల (ఎక్స్ షోరూమ్)కు కొనుగోలు చేయవచ్చు.

యువతకు ఎంతో ఇష్టమైన యమహా నుంచి ఎంటీ -15 వెర్షన్ 2.0 మోటారు సైకిల్ విడుదలైంది. దీనిలో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 18 హెచ్ పీ, 14.1 ఎన్ ఎమ్ టార్క్ విడుదల అవుతుంది. ఆరు స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను ఇంజిన్ కు జత చేశారు. యూఎస్ డీ ఫోర్కులు, మోనోషాక్ సెటప్, డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ బాగున్నాయి. సుమారు 48 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ రూ.1.68 లక్షలకు అందుబాటులో ఉంది.