EV Cars: మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఈవీ కార్లు.. ఈ ఏడాది రిలీజయ్యే కార్లు ఇవే..!

|

Apr 09, 2024 | 6:00 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌తో రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. దీంతో అన్ని కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఈవీ మార్కెట్‌లో స్కూటర్లతో పోల్చుకుంటే కార్లు పెద్దగా ప్రజాదరణ పొందలేదు. కానీ ఇటీవల కాలంలో ఈవీ కార్లల్లో వచ్చే సమస్యలకు చెక్‌ పెడుతూ సూపర్‌ మైలేజ్‌తో ఈవీ కార్లు మార్కెట్‌లోకి కార్లు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో రాబోయే ఎలక్ట్రిక్ కార్లలో మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌ తొలి ఈవీగా చాలా సంచలనం సృష్టిస్తోంది. అలాగే టాటా మోటార్స్, కియా, హ్యుందాయ్ ఈ సంవత్సరం కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈవీ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
టాటా మోటార్స్ దాని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. హారియర్ ఈవీను 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. వీటుఎల్‌(వెహికల్ టు లోడ్), వీటువీ (వెహికల్ టు వెహికల్) ఛార్జింగ్ సామర్థ్యాలతో హారియర్ ఈవీ జెన్‌2 ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారంగా పని చేస్తున్నారు. ఈ హారియర్ ఈవీ జూన్ 2024లో ప్రారంభించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం ఈ ఈవీ 50 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అలాగే ఈ ఈవీ 400 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. హారియర్‌ ఈవీ రూ.22 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2 / 5
టాటా మోటార్స్‌కు సంబంధించి కర్వ్‌ ఈవీ కూడా జూలై 2024లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఈ కారు టాటా మోటార్‌కు సంబందించిన ఎక్స్‌1 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా పని చేస్తుంది. కర్వ్‌ ఈవీ 56.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఈవీను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల పరిధితో పాటు నాలుగు గంటల ఛార్జింగ్ సమయం ఉంటుంది. ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది.

3 / 5
కొరియన్ వాహన తయారీదారు కియా జూన్ 2024లో కియా ఈవీ9 పరిచయం చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (ఈ-జీఎంపీ) ఆధారంగా ఇది 450 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది. ఈవీ 9 150 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారును ప్యాక్ చేస్తుంది. అలాగే ఈ ఈవీ 9.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. ఈ ఈవీ ధర రూ. 90 లక్షల నుంచి రూ. 1.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

4 / 5
మహీంద్రా ఎక్స్‌యూవీ ఈ8 ఈవీ కారు ఇంగ్లో మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ కారు డిసెంబర్ 2024లో రిలీజయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ కారు రూ. 35 లక్షల ధరతో విడుదల చేస్తారని అంచనా. వేస్తున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ ఈ8 క్లెయిమ్ చేసిన 450 కిమీ పరిధితో పాటు 2 బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది.

5 / 5
మారుతి సుజుకీ ఈవీఎక్స్‌  ఈ ఏడాది లాంచ్‌ కానుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఈవీఎక్స్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను హన్సల్‌పూర్‌లోని గుజరాత్ ఫెసిలిటీలో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కారు డిసెంబర్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఈవీఎక్స్‌  60 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఒకే ఛార్జ్‌పై సుమారు 550 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుంది.