
ఎలక్ట్రోలక్స్ 1 టన్ 3 స్టార్(Electrolux 1 Ton 3 star convertible inverter split AC).. ఈ ఏసీలోని మూడు దశల ఫిల్టర్ సిస్టమ్ 99.8 శాతం హానికరమైన బ్యాక్టీరియాను వడపోస్తుంది. గాలిలోని కాలుష్యం, ధూళి కణాలను శుభ్రం చేస్తుంది. దీనిలోని కన్వర్టిబుల్ ఫంక్షన్ కారణంగా మీ ఇంట్లో వ్యక్తులు, వెలుపలి ఉష్ణోగ్రత ఆధారంగా కంప్రెసర్ వేగాన్ని సులభంగా మార్చవచ్చు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, బిల్లులను ఆదా చేయవచ్చు. ఈ ఏసీలోని కంప్రెసర్ మీద పదేళ్లు, ఇన్వెర్టర్ మోడల్ పీసీబీ మీద ఐదేళ్ల వారంటీ ఉంది. త్రీస్టార్ ఎనర్జీ రేటింగ్, 41 డీబీ నాయిస్ లెవల్ దీని ప్రత్యేకతలు. రూ.32,990 ధరలో అందుబాటులో ఉంది.

లాయిడ్ 1.2 టన్ 5 స్టార్(Lloyd 1.2 Ton 5 star inverter split AC).. దీనిలోని 5 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫంక్షన్ కారణంగా చల్లని గాలి అన్ని వైపులకూ చక్కగా వీస్తుంది. పూర్తి రాగితో దీనిని రూపొందించారు. యాంటీవైరల్+ పీఎం 2.5 ఫిల్టర్ మీకు సహజ సిద్ధమైన స్వచ్ఛ గాలిని అందజేస్తుంది. గ్రాఫిక్ డిజైన్‌తో తెలుపు రంగులో ఆకట్టుకుంటున్న ఈ ఏసీ రూ.34,990 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీని వార్షిక విద్యుత్ వినియోగం 635.62 యూనిట్లు. పదేళ్ల పాటు కంప్రెసర్, ఐదేళ్లు కంపోనెట్, ఒక ఏడాది ప్రొడెక్ట్ పై వారంటీ ఉంది. 120 స్కేర్ ఫీట్ వైశాల్యం గల మీడియం సైజు గదులకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

కేరియర్ 1.5 టన్ 3 స్టార్(Carrier 1.5 Ton 3star inverter window AC).. ఈ ఏసీలోని కాపర్ కండెన్సర్ కాయిల్ పూర్తిస్తాయి రక్షణ అందిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ తో మంచి చల్లని గాలిని పొందవచ్చు. మీరు నిద్రిస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాయం కలగకుండా డిస్‌ప్లే దానికదే స్విచ్ ఆఫ్ అవుతుంది. దీని వార్షిక విద్యుత్ వినియోగం 1210.35 కేడబ్ల్యూ హెచ్ ఉంటుంది. ప్రొడెక్ట్ పై ఏడాది, కంప్రెసర్ పై పదేళ్ల వారంటీ ఇస్తున్నారు. చిన్న, మీడియం సైజు గదులను బాగా సరిపోతుంది. దీని ధర రూ 31,990.

డయాకిన్ 1 టన్ 3 స్టార్ (Daikin 1 Ton 3 star Fixed speed split AC).. మీ గదికి సరైన ఎయిర్ కండీషనర్. సుమారు 110 చదరపు అడుగుల విస్తీర్ణం వరకూ చల్లబరుస్తుంది. ఈ ఏసీకి ఏడాదికి 656.44 యూనిట్ల కేడబ్ల్యూహెచ్ విద్యుత్ అవసరమవుతుంది. కంప్రెసర్ పై ఐదేళ్లు, కండెన్సర్, ప్రాడక్ట్ లపై ఏడాది వారంటీ ఇస్తున్నారు. 110 చదరపు అడుగల విస్తీర్ణం కలిగిన చిన్న గదులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. త్రీ స్టార్ ఎనర్జీ రేటింగ్, 3.95 ఐఎస్ఈఈఆర్ వాల్యూ, 32 డీబీ నాయిల్ లెవెల్ దీని ప్రత్యేకతలు. ఈ ఏసీ రూ.32,500 ధరకు అందుబాటులో ఉంది.

ఎల్జీ 1 టన్ 3 స్టార్ (LG 1 Ton 3 Star Dual inverter split AC).. ఈ ఏసీ 110 చదరపు అడుగుల గదిని సులభంగా చల్లబరుస్తుంది. దీని 3 స్టార్ ఐఎస్ఈఈఆర్ రేటింగ్ కారణంగా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. దీని ఇంటెలిజెంట్స్ డ్యూయల్ ఇన్వర్టర్ తగిన శీతల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది.దీనిలోని కాపర్ ట్యూబ్ లు ఇసుక, ఉప్పు, పొగ, ఇతర కాలుష్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ ఏసీకి ఏడాదికి 642.26 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. గ్యాస్ చార్జింగ్ తో కలిసి కంప్రెసర్ పై పదేళ్లు, పీసీబీ పై ఐదేళ్లు, ప్రొడెక్ట్ పై ఏడాది వారంటీ ఉంది. త్రీ స్టార్ ఎనర్జీ రేటింగ్, 3.96 ఐఎస్ఈఈఆర్ వాల్యూ, 21 డీబీ నోయిస్ లెవెల్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ.34,990.