
రివోల్ట్ మోటార్స్ అధికారికంగా ఆర్‌వీ బ్లేజ్ఎక్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1,14,990 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు సీటు కింద ఛార్జింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది.

ఈ బైక్ 4జీ టెలిమాటిక్స్, జీపీఎస్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటుంది.

ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్‌లో ఆరు అంగుళాల ఎల్‌సీడీ డిజిటల్ క్లస్టర్ ఆకట్టుుకుంటుంది. అలాగే రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ సీబీఎస్ బ్రేకింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది.

రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ 4 కేడబ్ల్యూ పీక్ పవర్ మోటార్‌తో వస్తుంది. అందువల్ల ఈ బైక్ గంటకు 85 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అలాగే ఓ సారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ. పరిధిని అందిస్తుంది. ఈ బైక్‌ను కేవలం 80 నిమిషాల్లో 80 శాతం మేర చార్జింగ్ చేయవచ్చు.