Televisions Price: మరోసారి పెరగనున్న టీవీల ధరలు.. ప్యానెళ్ల దిగుమతి సుంకం విధించేందుకు కేంద్రం ప్రయత్నాలు..!

|

May 06, 2021 | 2:09 PM

Televisions Price: టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ..

1 / 4
టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం.

2 / 4
గత సంవత్సరం కూడా అక్టోబరు నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్యానెళ్ల దిగుమతిపై 5 శాతం సుంకం విధించింది. ఈ సుంకాన్ని మూడేళ్లలో 10-12 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

3 / 4
కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌లు టీవీ కంపెనీల ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలకు గండికొడుతున్నాయి. దాంతో చాలా కంపెనీలు ఈ ప్యానెళ్ల కోసం ప్రధానంగా చైనా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

4 / 4
ఈ సంవత్సరంలో టీవీల ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి.  ఒకసారి జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో పెరుగగా, మరోసారి ఏప్రిల్‌లో  కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో మరోసారి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.