మంచి మైలేజీ ఇచ్చే అడ్వెంచర్ బైక్ లలో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.1.47 లక్షలు, కాగా ప్రో వేరియంట్ కోసం రూ.1.54 లక్షలు ఖర్చుచేయాలి. 199.6సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 18.9 హెచ్ పీ, 17.35 టార్క్ విడుదలవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్కు బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు. దాదాపు 52 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.