
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.1 శాతం నుంచి వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల విద్యా రుణంపై ఈఎంఐ రూ. 31,272గా ఉంటుంది.

8.15 శాతం వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యా రుణాలపై స్వల్పంగా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల విద్యా రుణం కోసం ఈఎంఐ మొత్తం రూ.31,322 అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన విద్యార్థి కస్టమర్లకు అదే వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ విద్యా రుణాలపై 8.2 శాతం నుంచి వడ్డీని వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ.20 లక్షల విద్యా రుణంపై ఈఎంఐ రూ.31,372 అవుతుంది.

కెనరా బ్యాంక్ విద్యా రుణాలపై 8.6 శాతం నుండి వడ్డీ రేట్లు అందిస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ.20 లక్షల విద్యా రుణంపై ఈఎంఐ రూ.31,774గా ఉంటుంది.

ఇండియన్ బ్యాంక్ విద్యా రుణాలపై 8.8 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ.20 లక్షల విద్యా రుణంపై ఈఎంఐ రూ.31,976 అవుతుంది.