ఎండాకాలంలో రోడ్డుపై నడుచుకుంటూ లేదా వాహనాలపై వెళ్తున్నవారు మజ్జిగ లేదా లస్సీ కనిపిస్తే తాగేందుకు పక్కా ఆగుతారు. సమ్మర్‌లో మజ్జిగ ఓ ఎమోషన్. శరీరాన్ని చల్లపరచడం మాత్రమే కాకుండా.. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలానే లస్సీ కూడా. ఎండాకాలం 2, 3 నెలలు ఈ బిజినెస్ బాగుంటుంది. పెట్టుబడి కూడా తక్కువే. లస్సీ, మజ్జిగ కరెక్ట్ ప్లేసులో అమ్ముకుంటే పక్కాగా రోజుకు 1000 రూపాయలు లాభం వస్తుంది.
సమ్మర్‌లో ఆరోగ్యానికి మంచిదని చాలామంది పళ్ల రసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ జ్యూస్ బిజినెస్ చేస్తే అన్నీ పోను రోజుకు రూ.600 నుంచి 1000 వరకు సంపాదించుకోవచ్చు.
కూల్‌డింక్స్ బిజినెస్ చేస్తే ఎండాకాలంలో కాసుల పంట పండుతుంది.ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా.. ఇనిస్టెంట్ రిలీఫ్ అండ్ టేస్ట్ కోసం శీతల పానీయాలు తాగుతారు జనాలు. జనసంచారం బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిజినెస్ పెట్టుకుంటే.. నెలలో కనీసం 50 వేలు ఈజీగా సంపాదించవచ్చు.
ఈ ఎండాకాలం తాటి ముంజలు తింటే ఎంతో చలువ. వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతారు. లేత, లేత తాటి ముంజలు తెచ్చి విక్రయిస్తే.. రోజుకు 500 నుంచి 1000 మధ్య లాభం ఉంటుంది. పట్టణాల్లో అయితే డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఇంక ఎండాకాలంలో ఐస్ క్రీమ్ గురించి చెప్పేది ఏముంది. పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్లు సైతం ఐస్ క్రీమ్‌ను ఇష్టపడతారు. ఎక్కడైనా జనాలు ఉండే ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టుకుంటే.. నెలకు 50 వేలకు సంపాదించవచ్చు. ఇక నిమ్మకాయ సోడా బిజినెస్ కూడా బాగా సాగుతుంది. మంచి లాభాలు ఉంటాయ్ అదీ ట్రై చేయవచ్చు. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఈ బిజినెస్‌లో ప్లేస్ సెలక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. జనాలు ఎక్కువ తిరిగే ప్రాంతాల్లో అయితే మంచి లాభాలు అర్జించవచ్చు.