Saving Account: మీకు పొదుపు ఖాతా ఉన్నట్లయితే మీరు ఖాతాలో డిపాజిట్ చేసే డబ్బుపై కూడా వడ్డీని కూడా పొందుతారు. కానీ చాలా మంది పొదుపు ఖాతాలో జమ చేసిన డబ్బుకు కూడా పన్ను విధిస్తారని నమ్ముతుంటారు. ఇది కాకుండా ప్రజలు అధిక వడ్డీ కోసం ఫిక్స్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఖాతాలను తెరుస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో పొదుపు ఖాతా, ఎఫ్‌డీ సంబంధించి నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
పొదుపు ఖాతా వడ్డీపై పన్ను: మీరు ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా తెరిచినప్పుడు, మీకు ఎప్పటికప్పుడు వడ్డీ లభిస్తుంది. కానీ, పొదుపు ఖాతాలో వచ్చే వడ్డీ పన్ను స్లాబ్‌లో లేదు. అంటే, పొదుపు ఖాతా నుండి సంపాదించిన వడ్డీపై ఎలాంటి పన్ను విధించబడదు. ఇది పన్ను రహితమైనది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాపై వడ్డీ పన్ను విధించబడుతుందా?: అయితే, FD ఖాతాలో వడ్డీ ద్వారా సంపాదించిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. మీరు ఈ వడ్డీపై పన్ను చెల్లించాలి. దీనికి కూడా నియమాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అందుకునే వడ్డీ మొత్తాన్ని పన్ను విధించాలా వద్ద అనేదానిపై నిర్ణయించబడుతుంది.
ఎంత మొత్తం పన్ను విధించబడుతుంది..?: మీకు ఫిక్స్‌డిపాజిట్ నుంచి ప్రతి సంవత్సరం 40వేలకుపైగా వడ్డీ లభిస్తే, అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.
సీనియర్ సిటిజన్స్ పేరిట ఎఫ్‌డీ ఉంటే వారికి మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంగా రూ.50 వేల వరకు వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‌డీ)లపై చాలా ప్రయోజనాలను పొందుతారు. వడ్డీ రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.