
ఈ మధ్యకాలంలో చాలామందికి చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో టెలికం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా తక్కువ డబ్బుకే రీఛార్జ్ ప్లాన్స్‌ను అందిస్తుంటాయి.

ఇక ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ కోవలోనే తాజాగా పోటీదారులకు సవాల్ విసురుతూ ఓ మాంచి ఆఫర్ అమలులోకి తెచ్చింది.

రిలయన్స్ జియో తన కస్టమర్లకు కేవలం రూ. 49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అయితే దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒక రోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

కానీ ఇందులో కాలింగ్, ఎస్‌ఎంఎస్ సౌకర్యం పొందలేరు. మరోవైపు రూ. 11కే గంట పాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. రిలయన్స్ జియో తన పోటీదారులైన టెలికం కంపెనీల నుంచి తీవ్రపోటీని ఎదుర్కుంటోంది. ఇక జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్లు ఎయిర్‌టెల్, వోడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌కి మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.