Post Office: కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్ గురించి తెలుసా..?

Updated on: Jan 18, 2026 | 11:38 AM

నేటి కాలంలో కష్టపడి సంపాదించిన డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు మంచి లాభాలను అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారికి పోస్టాఫీసు అందిస్తున్న టైమ్ డిపాజిట్ ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పటికే చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వ భరోసా ఉండటమే కాకుండా బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీని అందించే ఈ పథక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

1 / 5
ఏమిటీ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్: దీనినే నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే. మీ దగ్గర ఉన్న డబ్బును ఒక నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయడం ద్వారా స్థిరమైన వడ్డీని పొందవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా 1, 2, 3 లేదా 5 ఏళ్ల కాలపరిమితితో ఈ ఖాతాను తెరవవచ్చు.

2 / 5
మీరు ఎంచుకునే కాలాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఒక సంవత్సరానికి అయితే 6.9 శాతం, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

3 / 5
రూ. 2 లక్షల వడ్డీని పొందడం ఎలా: మీరు ఐదు సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుని.. రూ. 4.5 లక్షలను పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం.. మెచ్యూరిటీ సమయానికి మీకు సుమారు రూ. 6,52,255 లభిస్తాయి. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీరు రూ. 2,02,255 సంపాదించవచ్చు.

4 / 5
 ఈ పథకం ప్రత్యేకతలు:  కేవలం రూ. 1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌లో చేసే పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు, కానీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు.

5 / 5
ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి వంద శాతం గ్యారెంటీ ఉంటుంది. రిస్క్ లేని పెట్టుబడి మార్గాల కోసం చూస్తున్న వారికి, ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు దాచుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఒక బెస్ట్ ఆప్షన్.