- Telugu News Photo Gallery Business photos Post Office RD Scheme: Invest Rs 15,000 per Month, Get Rs 10.7 Lakhs in 5 Years
Post Office: నెలకు అతితక్కువ పెట్టుడితో 5 ఏళ్లలోనే చేతికి రూ.11 లక్షలు.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
ఈ మధ్య కాలంలో చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వం హామీ, మంచి ఆదాయం రావడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. పోస్టాఫీస్ సైతం ఎన్నో మంచి స్కీమ్స్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీరు కొద్దికొద్దిగా డబ్బు దాచుకొని, కొన్ని సంవత్సరాలలో ఆ డబ్బును పెద్ద మొత్తంగా మార్చాలనుకుంటే, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి ప్రమాదం లేకుండా స్థిర వడ్డీ రేట్లతో లక్షల రూపాయల విలువైన నిధిని పొందవచ్చు.
Updated on: Nov 05, 2025 | 4:47 PM

RD పథకం ఎలా ఉంటుంది..? : ఈ పథకంలో ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని జమ చేయడం. మీరు ఈ డబ్బును వరుసగా 5 సంవత్సరాలు కడతారు. దీనికి పోస్ట్ ఆఫీస్ మీకు వడ్డీ ఇస్తుంది. వడ్డీ కూడా మీ డబ్బుకు కలుస్తూ పోవడం వలన, మీ పొదుపు చాలా వేగంగా పెరుగుతుంది. ఈ పథకంలో వడ్డీపై వడ్డీ రావడం విశేషం.

ఎంత పొందుతారు?: మీరు ప్రతి నెలా రూ.15,000 డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్లలో మీరు మొత్తం రూ.9 లక్షలు జమ అవుతుంది. ప్రస్తుతం ఉన్న 6.7శాతం వడ్డీ రేటుతో, మీకు సుమారు రూ.1.7 లక్షల వడ్డీ వస్తుంది. మొత్తంగా, 5 సంవత్సరాల తర్వాత మీకు రూ.10.7 లక్షలు వస్తాయి.

ఈ స్కీమ్ ఎందుకు బెస్ట్..?: పోస్ట్ ఆఫీస్ RD పథకానికి భారత ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. దీని అర్థం . కాబట్టి, మార్కెట్లో నష్టాలు వచ్చినా, మీ డబ్బుకు ఏమీ కాదు. ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి. రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ఈ పథకంలో వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ప్రస్తుతం 6.7 వార్షిక వడ్డీ లభిస్తుంది. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మీకు ఎంత వస్తుందో మీకు ముందే తెలుస్తుంది. ఆర్‌డి పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాను తెరవవచ్చు.

ప్రధానంగా ఈ పథకం పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు మీ భవిష్యత్తు కోసం సురక్షితమైన, మంచి పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే, ఈ పోస్ట్ ఆఫీస్ RD పథకం ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చిన్న పొదును ఇది ఒక పెద్ద నిధిగా మారుస్తుంది.




