
పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటివరకు 13 వాయిదాలను రైతులకు అందించింది. ఈ క్రమంలో 14వ విడత సాయం రూ. 2000ల సాయం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కొంతమంది రైతులు 2 వాయిదాల సాయం అంటే రూ. 4000లను ఒకేసారి అందుకుంటారని తెలుస్తోంది.

అంటే, ఎవరైతే 13వ విడతలో సాయం రూ.2000లు అందుకోలేదో.. వారు 14వ విడత సాయంలో మొత్తం రూ.4000లు అందుకుంటారని చెబుతున్నారు.

అయితే, ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలోని ఎంత మంది రైతులు లబ్ధి పొందుతారనేది రైతులకు ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చింది.

ఈ పథకం కింద ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏటా రూ. 6000 అందజేస్తుంది. దీని కింద ఏడాదికి మూడు వాయిదాల ద్వారా ఈ రూ. 6000లను రైతుల ఖాతాలో జమ చేస్తారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం మొత్తం రైతు కుటుంబానికి అందించబడుతుంది. ఈ కుటుంబంలో, భర్త, భార్య , వారి పిల్లలను ఈ పథకంలో చేర్చారు. భార్యాభర్తలిద్దరికీ విడివిడిగా ఈ పథకం ప్రయోజనం ఇవ్వాలనే నియమం ఇందులో లేదు.

ఈ పథకానికి సంబంధించిన మూడు వాయిదాల సొమ్ము ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్ వరకు, డిసెంబర్ నుంచి మార్చి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 14వ విడత మే నెలలో వచ్చే అవకాశం ఉంది.

Money

ఇదిలావుంటే, 2019లో పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.