CNG Car: ఆ కారుకు సీఎన్‌జీ కిట్ విడుదల చేసిన నిసాన్.. ఇక నిర్వహణ మరింత సులభం

Updated on: Jun 01, 2025 | 7:30 PM

భారతదేశంలోని మెజార్టీ ప్రజలకు కారు అనేది ఓ ఎమోషన్. ఈ దేశంలో కారులో ప్రయాణించడాన్ని ఓ హోదా కింద ఫీలయ్యే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కారు ప్రయాణాన్ని ఇష్టపడినా కారు నిర్వహణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ నిస్సాన్ తన మ్యాగనైట్ వెర్షన్‌కు తాజాగా సీఎన్‌జీ కిట్‌ను విడుదల చేసింది. ఈ సీఎన్జీ కిట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
భారతదేశంలో మాగ్నైట్ కోసం నిస్సాన్ సీఎన్‌జీ రెట్రోఫిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆమోదించిన సీఎన్‌జీ కిట్‌ను మోటోజెన్ అందిస్తుంది. ఈ కిట్‌ను ఫిట్మెంట్ స్టేషన్లలో మాత్రమే ఇన్స్టాల్ చేయవచ్చు.

2 / 5
సీఎన్‌జీ కిట్ కోసం మాగ్నైట్‌కు సంబంధించిన ఎక్స్-షోరూమ్ ధర పైన నిస్సాన్ అదనంగా రూ. 74,999 వసూలు చేస్తుంది. ఇది మోటోజెన్ అందించే మూడు సంవత్సరాలు లేదా 100,000 కి.మీ ప్రామాణిక వారంటీతో వస్తుంది.

3 / 5
ఈ సీఎన్‌జీ రెట్రోఫిట్ ఎంపిక మాగ్నైట్‌కు సంబంధించిన 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. దీనిని 1.0-లీటర్ ఏఎంటీ, 1.0- లీటర్ టర్బో మాన్యువల్ లేదా 1.0-లీటర్ సీవీటీ వేరియంట్లలో ఇన్స్టాల్ చేయలేము.

4 / 5
మాగ్నెట్లోని నాన్-టర్బో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 72 హెచ్‌పీ, 96 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ నడుస్తున్నప్పుడు ఇంజిన్‌కు సంబంధించిన పవర్ అవుట్‌పుట్‌ను నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు.

5 / 5
నిస్సాన్ మాగ్నైట్ రూ.6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. సీఎన్‌జీ కిట్ ధరతో కలిపి రూ. 6.89 లక్షల వరకు ఉంటుంది.