MSME రంగానికి పెద్ద పీట.. రూ.100 కోట్ల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు.. కొత్త పథకం

|

Jan 09, 2025 | 5:58 PM

MSME రంగానికి రూ. 100 కోట్ల వరకు కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఎఫ్ ఇన్నాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం నాగరాజు తెలిపారు. రూ.100 కోట్ల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందవచ్చు..

1 / 5
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ప్రభుత్వం త్వరలో కొత్త రుణ హామీ పథకాన్ని ప్రారంభించబోతోందని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు గురువారం ప్రకటించారు. ఈ పథకం కింద రూ.100 కోట్ల వరకు ఎలాంటి హామీ లేకుండా పారిశ్రామికవేత్తలకు రుణాలు అందజేస్తారు.

2 / 5
'గ్రామీణ భారత్ మహోత్సవ్' ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో ప్రకటించారని, దీని కింద ఇప్పటికే తమ వ్యాపారాన్ని నడుపుతున్న పారిశ్రామికవేత్తలకు రూ. 100 కోట్ల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

3 / 5
ఈ పథకం ఆమోదం కోసం త్వరలో కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్నారు. 2024-25 బడ్జెట్‌లో ఈ పథకం యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేయడానికి MSMEలకు గ్యారెంటీ లేకుండా టర్మ్ లోన్ సౌకర్యం కల్పిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ పథకం కింద ప్రతి దరఖాస్తుదారునికి రూ. 100 కోట్ల వరకు గ్యారెంటీ కవర్ అందించనుంది ప్రభుత్వం.

4 / 5
MSME రంగం భారతదేశంలో సుమారు ఐదు కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తోందని నాగరాజు అన్నారు. MSMEల ఎగుమతుల్లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. 2020-21లో రూ.3.95 లక్షల కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.12.39 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్యంలో MSMEలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

5 / 5
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో MSMEల సహకారం కూడా పెరిగింది. 2017-18లో 29.7% ఉండగా, 2022-23లో 30.1%కి పెరిగింది. గ్రామీణ భారతంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని రుణాలు అందించడంపై దృష్టి సారిస్తోందని నాగరాజు తెలిపారు. భారతదేశ అభివృద్ధికి, నాణ్యత, ఎగుమతులకు మెరుగైన కనెక్టివిటీ, సామర్థ్య పెంపుదల, అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పాటు అనే నాలుగు అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.