
మారుతి సుజుకి స్విఫ్ట్: మారుతి సుజుకి మైలేజ్ పరంగా చాలా మంచి కారు. కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ 24.8 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ మోడల్ 25.75 Kmpl మైలేజీని ఇస్తుంది. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5700 rpm వద్ద 80.4 bhp, 4300 rpm వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో: టాటా టియాగో ధర రూ. 5 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 6 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నివేదికల ప్రకారం, మాన్యువల్ వేరియంట్ 20.09 Kmpl మైలేజీని ఇస్తుంది. అలాగే ఆటోమేటిక్ వేరియంట్ 19 Kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 1.2-లీటర్ ఇంజన్ ఉంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 84.8 బిహెచ్‌పి, 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది. ఇందులో 6 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనంలో 1.0-లీటర్ ఇంజన్ కలదు. దీని ఆటోమేటిక్ వేరియంట్ 22.3 Kmpl మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్ 21.46 Kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ నాలుగు వేరియంట్లు, 9 కలర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ARAI నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి వ్యాగన్ R మాన్యువల్ వేరియంట్ 23.56 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 24.43 Kmpl మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్: 12 కలర్ ఆప్షన్‌లు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2-లీటర్ కప్పా ఇంజన్ కలదు. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 19.4 Kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.2 Kmpl మైలేజీని ఇస్తుంది.