Maruti Wagonr: మరింత భద్రత.. ఇప్పుడు మారుతి వ్యాగన్ఆర్‌ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు!

Updated on: Apr 11, 2025 | 1:26 PM

Maruti Wagonr: ఈ రోజులలో కారు కొనాలనే కల చాలా మందిలో ఉంటుంది. ఇక సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండేవి మారుతి సుజుకీ కార్లు. అందులో వ్యాగన్‌ఆర్‌ ఒకటి. తక్కువ ధరల్లో మంచి ఫీచర్స్‌ ఉండే కారులో ఇదొకటి. ఆ కంపెనీ చాలా కాలంగా ఈ స్థానాన్ని నిలుపుకుంది..

1 / 5
Maruti Wagonr: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ కంపెనీలలో మారుతి ఒకటి. ఆ కంపెనీ చాలా కాలంగా ఈ స్థానాన్ని నిలుపుకుంది. భవిష్యత్తులో కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీ ఇప్పుడు భద్రతా లక్షణాలపై దృష్టి సారిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు సరసమైన ధరలతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మారుతి తన బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్‌లో భద్రతను పెంచింది. ఇప్పుడు ఈ కారు దాని ప్రధాన ప్రత్యర్థి టాటా కంటే సురక్షితమైనదిగా పరిగణిస్తుంది.

2 / 5
మారుతి వ్యాగన్ఆర్ లో 6 ఎయిర్ బ్యాగులు: మారుతి వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, ఇష్టపడే కార్లలో ఒకటి. ఈ బ్రాండ్ ఇప్పుడు భద్రతపై తీవ్రమైన శ్రద్ధ చూపుతోంది. బ్రెజ్జా, సెలెరియో, గ్రాండ్ విటారా వంటి కార్లలో ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చింది. వ్యక్తిగత వినియోగంతో పాటు క్యాబ్ సేవలకు కూడా బాగా ప్రాచుర్యం పొందిన వ్యాగన్ఆర్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌డేట్‌ చేసింది.

3 / 5
ధర ఎంత?: WagonR ప్రధాన ప్రత్యర్థి Tata Tiago కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే అందించింది. గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ 4 స్టార్‌ రేటింగ్‌ ఉంది. అదే సమయంలో మారుతి వ్యాగన్ఆర్ ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను జోడించినప్పటికీ ఎటువంటి మార్పు చేయలేదు. వ్యాగన్ఆర్ ధర రూ. 6.61 లక్షల నుండి ప్రారంభమై రూ. 8.73 లక్షల వరకు (ఆన్-రోడ్, ముంబై) ఉంటుంది.

4 / 5
ఫీచర్స్‌ పరంగా చూస్తే.. WagonR ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ ORVMలు, స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలు వంటి ప్రాథమిక  ఫీచర్స్‌తో ఉంటుంది. దీనితో పాటు ABS, EBD, స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నాయి.

5 / 5
పవర్‌ట్రెయిన్: వ్యాగన్ఆర్ రెండు ఇంజన్‌ ఆప్షన్‌లతో వస్తుంది. వీటిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (66 bhp, 89 Nm), 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (89 bhp, 113 Nm) ఉన్నాయి. దీనితో పాటు మారుతి 1.0-లీటర్ ఇంజిన్‌తో CNG వేరియంట్‌ను కూడా అందిస్తుంది. ఇది 56 bhp, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు పెట్రోల్ ఇంజన్లు 5-స్పీడ్ MT లేదా AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తాయి. అయితే CNG వేరియంట్ 5-స్పీడ్ MTతో మాత్రమే లభిస్తుంది.