
Maruti Suzuki: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై నెల వరకే అందుబాటులో ఉండనుంది.

సుజుకీ ఆల్టో కారుపై రూ.43 వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. కన్సూమర్ ఆఫర్ కింద రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

ఎస్‌ప్రెసో కారుపై రూ.43వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉండగా, కన్సూమర్ ఆఫర్ కింద రూ.25,000, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. మారుతీ ఇకో మోడల్‌పై రూ.28 వేల వరకు తగ్గింపు కూడా అందిస్తోంది.

మారుతీ సెలెరియో కారుపై రూ.18 వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

మారుతీ స్విఫ్ట్ కారుపై గరిష్టంగా రూ.54 వేల వరకు తగ్గింపు అదుబాటులో ఉంది. కన్సూమర్ ఆఫర్ కింద రూ.30 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4 వేల వరకు తగ్గింపు ఉంది. మారుతీ డిజైర్ కారుపై రూ.34 వేల వరకు, మారుతీ వితారా బ్రెజా కారుపై రూ.39 వే ల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.