Maruti Suzuki: ఆ ఒక్క ప్రకటనతో హై స్పీడ్‌లో దూసుకుపోతున్న మారుతి సుజుకి షేర్లు..ఎందుకంటే?

|

Mar 23, 2021 | 12:35 PM

Maruti Suzuki: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్‌ నుంచి తన అన్ని రకాల కార్లమోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల..

1 / 4
Maruti Suzuki: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్‌ నుంచి తన అన్ని రకాల కార్లమోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది  దీంతో కారు కొనుగోలు చేసే వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల కారణంగా కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.

2 / 4
అయితే ఏ మోడల్‌ ఎంత ధర పెరుగుతుందో అనే అంశాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను రూ.34వేల వరకు పెంచింది. మొబిలిటీ, ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ప్రోగ్రాం కింద మూడు కొత్త స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు మారుతీ సంస్థ తెలిపింది. నేబుల్‌ ఐటీ, రెడ్‌బాట్‌, స్టీవ్‌ వీటిలో ఉన్నాయి. ఇకపై పెయిడ్‌ ప్రాజెక్టుల్లో భాగం కావచ్చని తెలిపింది.  అయితే మేజర్ వాహనాల ధరలను పెంచిన తర్వాత మార్చి 23న ఉదయం సెషన్‌లో మారుతీ సుజుకీ ఇండియా షేర్‌ ధర ఒక శాతం పెరిగింది.

3 / 4
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఏప్రిల్ 2021 నుండి వాహనాల ధరలను పెంచింది. గత సంవత్సరంలో, వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితమైంది. అందువల్ల, సంస్థ ముందుకు సాగడం అత్యవసరం. ఏప్రిల్, 2021 లో ధరల పెరుగుదల ద్వారా వినియోగదారులకు పైన పేర్కొన్న అదనపు వ్యయం యొక్క కొంత ప్రభావం చూపనుంది.ఫిబ్రవరి మారుతి సుజుకీ 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాది 140,933 యూనిట్లు ఉండేది. ఇందులో 165,783 ప్యాసింజర్‌ వాహనాలు, 2,397 లైట్‌ కమర్షియల్‌ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి. ఇక  అమ్మకాల్లో కంపెనీ 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ

4 / 4
గత నెలలో 144,761 ప్యాసింజర్‌ వాహనాలు, 2,722 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 5,500 వాహనాలు ఇతర ఓఈఎం లకు విక్రయించబడ్డాయి. 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయతే 2020-21 ఏప్రిల్‌-ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు 12.8 శాతం తగ్గి, 1,290,847 యూనిట్లకు చేరుకున్నాయి.