సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. నెలకు రూ. 200 చెల్లిస్తే.. సంవత్సరానికి రూ. 72 వేలు పొందొచ్చు.!

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారా.? రిటైర్మెంట్ అనంతరం అధిక రాబడి పొందేందుకు డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా.?

|

Updated on: Nov 24, 2022 | 10:01 AM

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారా.? రిటైర్మెంట్ అనంతరం అధిక రాబడి పొందేందుకు డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా.? అయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ యోజన స్కీం గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పధకం మీ పెట్టుబడిపై భద్రతతో మంచి రాబడిని ఇస్తుంది.

1 / 6
దేశంలోని అనధికారిక రంగాల్లోని ఉద్యోగుల కోసం మోదీ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌ను కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ 2019లో ప్రారంభించింది. ఈ పథకం కింద, వివాహిత జంట నెలకు రూ. 200 పెట్టుబడి పదవీ విరమణ తర్వాత వారికి రూ. 72 వేల వార్షిక పెన్షన్ లభిస్తుంది.

2 / 6
వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, లోడింగ్ చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రిక్షా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ తయారీదారులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఇతర సారూప్య వృత్తులు, నెలకు రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ నెలవారీ ఆదాయం పొందుతూ 18-40 సంవత్సరాల వయస్సు కలిగినవారు ఈ పథకానికి అర్హులు.

3 / 6
 ఈ పధకం కింద వివాహిత జంట వార్షిక పింఛను రూ.72 వేలు పొందొచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయస్సు ఉంటే, ఈ పథకానికి నెలవారీ పెట్టుబడి దాదాపు రూ. 100 ఉంటుంది. ఆ విధంగా నెలకు భార్యాభర్తలు ఇద్దరూ చేస్తే రూ. 200 అవుతుంది. ఈ విధంగా, ఆ దంపతుల సంవత్సరంలో రూ.2,400 జమ చేస్తారు. 60 ఏళ్లు నిండిన తర్వాత, ఆ దంపతులకు ఏటా రూ. 72,000 పెన్షన్ లభిస్తుంది.

4 / 6
ఈ పధకం కింద 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ప్రతీ చందాదారుడు నెలకు రూ. 3,000 కనీస హామీ పెన్షన్ పొందుతారు. పింఛను పొందుతున్న సమయంలో ఒకవేళ చందాదారుడు మరణిస్తే, లబ్దిదారుడి జీవిత భాగస్వామికి లబ్ధిదారుడు అందుకున్న పెన్షన్‌లో 50 శాతం కుటుంబ పెన్షన్‌గా పొందేందుకు అర్హులు. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.

5 / 6
ఈ పధకానికి నమోదు ఎలా చేసుకోవాలి.? చందాదారుడు తన మొబైల్ నెంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి. అర్హత కలిగిన లబ్దిదారులు సమీపంలోని CSCని సందర్శించి.. స్వీయ-ధృవీకరణ ఆధారంగా ఆధార్ నెంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/జన్-ధన్ ఖాతా నెంబర్‌ను ఉపయోగించడం ద్వారా PM-SYM కోసం నమోదు చేసుకోవచ్చు.

6 / 6
Follow us