
కొత్త కారు కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్ ఇది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

ఎక్స్‌యూవీ 300 కారుపై రూ.44,500 వరకు తగ్గింపు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 500 మోడల్‌పై రూ.85,800 వరకు తగ్గింపు అవకాశం కల్పిస్తోంది. అలాగే స్కార్పియో కారుపై రూ.36,500 వరకు డిస్కౌంట్ అవకాశం కల్పిస్తోంది.

బొలెరో కారుపై కూడా ఆఫర్ కల్పించింది. ఈ మోడల్‌పై రూ.17,500 వరకు తగ్గింపు ఉంది. ఇంకా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ కారుపై రూ.62 వేల వరకు డిస్కౌంట్ ప్రయోజనం కల్పిస్తోంది. మరాజో కారుపై రూ.41 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

అల్టురాస్ జీ4 కారుపై రూ.3 లక్షల వరకు తగ్గింపుతో అందిస్తోంది. పూర్తి వివరాలు కావాల్సి ఉంటే షో రూమ్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. అంతేకాదు మహీంద్రా ఆఫర్లలో క్యాష్‌బ్యాక్, ఎక్సేఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి.