Mahindra Offer: పండగ సీజన్ సందర్భంగా దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన మల్టీ పర్పస్ వెహికల్స్, స్పోర్ట్ యుటిలిటీ వాహనాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఏకంగా రూ. 81,500 వరకు డిస్కౌంట్, ఇతర ప్రయోజనాలు అందజేస్తుంది. మహీంద్రా తన పాపులర్ బొలెరో మోడల్నుండి అల్టురాస్ జీ4 వరకు అన్ని మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది.
మహీంద్రా అత్యంత సరసమైన మోడల్- KUV100 NXTపై- కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ .3 వేలు, క్యాష్ డిస్కౌంట్ కింద రూ.38,055 అందజేస్తుంది. మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ .20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .15 వేలు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఈ మోడల్‌పై రూ .5 వేల విలువైన యాక్సెసరీలు, రూ.4 వేల అడిషనల్ కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
వేరియంట్ ఆధారంగా ఈ డిస్కౌంట్లు, ప్రయోజనాల్లో స్వల్ప మార్పులుంటాయని మహీంద్రా వెల్లడించింది. అన్ని మహీంద్రా వాహనాల్లో కెల్లా బొలేరో మోడల్‌పై అత్యంత తక్కువ డిస్కౌంట్అందిస్తోంది. ఈ మోడల్‌పై కేవలం రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే అందజేస్తుంది.
అలాగే మహీంద్రా మరాజో కొనుగోలుపై రూ .20 వేల క్యాష్డిస్కౌంట్, రూ. 5,200 కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు అందిస్తోంది. అయితే వేరియంట్లను బట్టి ఈ డిస్కౌంట్‌లో స్పల్ప మార్పు ఉంటుందని సంస్థ పేర్కొంది. మహీంద్రా స్కార్పియోపై రూ .5 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.13,320 ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.
అన్ని మహీంద్రా మోడల్స్‌లో కెల్లా మహీంద్రా ఆల్టూరాస్ జి 4 పై అతిపెద్ద డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మోడల్‌ను రూ. 81,500 డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ. 50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.11,500 కార్పొరేట్ బెనిఫిట్స్, రూ .20 వేల అడిషనల్ బెనిఫిట్ వంటివి ప్రకటించింది.