
LOT Mobiles: ప్రస్తుతం పండగ సీజన్‌లో పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్ వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. స్మార్టు ఫోన్స్, స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని 'లాట్' మొబైల్స్ కొనుగోలుదారులకు మంచి ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కార్డు నుంచి కొనుగోలు చేసినట్లయితే 5 శాతం వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం. అఖిల్ తెలిపారు.

స్మార్ట్ టీవీలపై రూ.7వేల వరకు, హెచ్‌పీ, రియల్‌మీ లాప్‌లాప్‌లపై కూడా ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు. వీటిపై రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

కొనుగోలు చేసిన వాటిపై సులభమైన వాయిదాల పద్దతిలో చెల్లించుకునే వెలుసుబాటు కూడా ఉందని తెలిపారు. ఇవేకాకుండా స్మార్ట్ టీవీ ఎక్స్ఛేంజీ ఆఫర్ వంటి వాటిని కూడా సంక్రాంతి సందర్భంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ టీవీపై రూ.3,500 వరకూ ఎక్స్ఛేంజీ ఆఫర్ చేస్తున్నారు.