
ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పనికి కూడా దీనితో అవసరం ఏర్పడుతోంది. బ్యాంకింగ్ సేవలు, మొబైల్ కనెక్షన్, ప్రభుత్వ పథకాలు, ప్రయాణ గుర్తింపు ధృవీకరణ వంటి అనేక ఇతర సేవలను పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకే చాలా మంది దీన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అయినా కూడా కొన్ని సార్లు దురదృష్టవశాత్తు ఆధార్ కార్డ్ పోగొట్టుకుంటే చాలా ఆందోళన చెందుతుంటారు. అయితే మరి ఆధార్ పోతే ఏం చేయాలనే విషయంపై అందరికీ అవగాహన ఉండదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆధార్ కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి? ముందుగా కార్డు పోగొట్టుకున్నంత మాత్రాన మీ ఆధార్ నంబర్ చోరీకి గురైనట్లు కాదని గుర్తుంచుకోండి. మీ బయోమెట్రిక్, వ్యక్తిగత డేటా UIDAI వద్ద సురక్షితంగా ఉంటుంది. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసి ఉంటే మీరు నిమిషాల్లోనే మీ ఇ-ఆధార్‌ను త్వరగా యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ ఆధార్ నంబర్‌ను ఎలా తిరిగి పొందాలి.. మీరు మీ ఆధార్ నంబర్‌ను మరచిపోతే, UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, "లాస్ట్ లేదా ఫర్గాటెన్ EID/UIDని తిరిగి పొందండి" ఎంపికపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పేరు, ఇతర ప్రాథమిక వివరాలను నమోదు చేసిన తర్వాత, OTP ధృవీకరణ జరుగుతుంది, UIDAI మీ ఆధార్ నంబర్‌ను మీ మొబైల్‌కు SMS ద్వారా పంపుతుంది.

మీ ఆధార్ నంబర్ వచ్చిన తర్వాత, మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి 'డౌన్‌లోడ్ ఆధార్' పై క్లిక్ చేయాలి. మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి, మీరు సాధారణ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా మాస్క్డ్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని ఎంచుకోవాలి, ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి.

ఈ ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీరు మీ ఆధార్ కార్డ్ PDF వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. PDF ఫైల్‌ను తెరవడానికి పాస్‌వర్డ్ సాధారణంగా మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు పెద్ద అక్షరాలలో, మీ పుట్టిన సంవత్సరంతో పాటు ఉంటుంది.