Mahindra XUV300: మహీంద్రా XUV300 కూడా సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్‌ను పొందింది. ముందు సీటు ప్రయాణీకుల భద్రత పరంగా 5 స్టార్స్, వెనుక సీట్ ప్రయాణికుల సేఫ్‌టీ పరంగా 4 స్టార్స్‌ను ఈ కారు సాధించుకుంది. సేఫ్‌టీ పాయింట్లలో ఈ కారు 17కు 16.42 స్కోర్ చేసింది. ఈ కారులో నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.41 లక్షలు.
Tata Nexon: టాటా నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇక టాటా నెక్సన్ కారు.. గ్లోబల్ NCAPలో ఫైవ్ స్టార్ రేటింగ్‌తో సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. ఈ కారు 17కి 16.06 పాయింట్లను సాధించింది. ఇందులో ABS, 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ భద్రతా ఫీచర్లుగా ఉన్నాయి. దీని బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలు.
Mahindra Thar: ఆఫ్-రోడ్ SUV మహింద్రా థార్ కూడా బలమైన సేఫ్‌టీ ఫీచర్లతో వస్తుంది. మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కార్ గ్లోబల్ NCAP నుంచి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ SUV కారులో డ్రైవర్, ప్రయాణీకులకు మంచి ఛాతీ రక్షణ లభిస్తుంది. ఇక ఈ మహింద్రా థార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ కంపెనీకి చెందిన బ్రెజ్జా 2018 గ్లోబల్ NCAP కార్ సేఫ్టీ టెస్టింగ్‌లో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. స్కోర్ పరంగా కారు 17 పాయింట్లకు 12.5 తెచ్చుకుంది. కారు డ్రైవర్, తోటి ప్రయాణీకుల తల, మెడకు మంచి భద్రతను అందిస్తుంది. తద్వారా మారుతి సుజుకి బ్రెజ్జా భారతదేశపు అత్యంత సురక్షితమైన SUVలో కూడా చేర్చబడింది. ఈ మారుతి సుజుకీ బ్రెజ్జా బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.19 లక్షలు.
Tata Punch: టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా పంచ్ గ్లోబల్ NCAP కార్ టెస్ట్‌లో 17 పాయింట్లకు 16.45 పాయింట్లను సాధించింది. ఈ కార్ ఫ్రంట్ సీట్ ప్రయాణీకుల భద్రత పరంగా 5 స్టార్స్, బ్యాక్ సీటు ప్రయాణీకుల భద్రతకు 4 స్టార్స్ రేటింగ్ పొందింది. ఈ కారులో ABS, EBD, బ్రేక్ స్వే కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ వంటి అద్భుత ఫీచర్లు కూడా ఉండడం దీని ప్రత్యేకత. ఈ కారు బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.