
బంగారం ధరలు తారుమారయ్యాయి. గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పడిపోతుండగా.. ఇప్పుడు తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధరలు ఒక్కరోజులోనే పెరిగి షాకిచ్చాయి. దీంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. ఈ పెరుగుదల తర్వాత శనివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,080 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ రూ.220 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,900గా ఉండగా.. నేడు రూ.200 పెరుగుదల నమోదు చేసింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,080 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,900గా ఉంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,370 వద్ద ట్రేడవుతోండగా.. శనివారం రూ.330 పెరిగిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,000గా ఉండగా.. నేడు రూ.300 మేర పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,080 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,46,230 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,050గా ఉంది.

అటు సిల్వర్ ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.55 లక్షలు పలుకుతోంది. చెన్నైలో కూడా రూ.2.55 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2.50 లక్షలుగా ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన గోల్డ్ రేట్లపై ప్రభావితం చూపిస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరడంతో గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇదే పెరుగుదల కొనసాగుతుందా.. లేదా పెరుగుతుందా అనేది చూడాలి.