
గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే ధరలు తారుమారయ్యాయి. గురువారం రోజున గత 8 నెలల కనిష్ట స్థాయికి పసిడి ధరలు క్రాష్ అయ్యాయి. అయితే మరుసటి రోజే ధరలు పెరిగి షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అనంతరం ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,600 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ రూ.270 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,29,800గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదు చేసింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,600గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,29,800 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,390గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,600 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,29,800గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,41,750 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,29,950గా ఉంది. అటు వెండి ధరల విషయానికొస్తే ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900గా ఉండగా.. నిన్న రూ.2.35 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో రూ.2,29,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.30 లక్షలుగా ఉంది.

చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతోండగా.. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. డాలర్ బలం పుంజుకోవడంతో గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలే దీనికి కారణంగా చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.