Indian Railways: గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్స్‌

Updated on: Dec 28, 2025 | 9:32 AM

Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ముందుస్తుగా టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించే రోజు టికెట్స్‌ కావాలంటే టికెట్స్‌ దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యకు చెక్‌ పెడుతోంది ఇండియన్‌ రైల్వే. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది..

1 / 5
 Indian Railways: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలను అందిస్తోంది. ముఖ్యంగా టికెట్‌ బుకింగ్‌ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ప్రయాణికులకు టికెట్‌ లభ్యత విషయంలో చర్యలు చేపడుతుంది. అయితే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.

2 / 5
 అయితే ప్రయాణం కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటే పెద్ద సమస్య ఉండదు గానీ, అనుకోని పరిస్థితుల్లో లేదా పండుగ సీజన్లలో ప్రయాణించాల్సి వస్తే రైలు టికెట్ దొరకడం కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో బస్సులను, ఇతర రవాణాను ఆశ్రయించాల్సి ఉంటుంది. కానీ అలాంటి టెన్షన్‌ లేకుండా రైలు బయలుదేరే ముందు కూడా టికెట్స్‌ లభించే సదుపాయం తీసుకువచ్చింది.

3 / 5
 ట్రైన్‌ బయలుదేరడానికి 4 గంటల ముందు చివరి చార్ట్‌ తయారు అవుతుంది. అప్పటి వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ చివరి చార్ట్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరే 30 నిమిషాల ముందు తయారవుతుంది. అంటే, రైలు ప్రయాణానికి అరగంట ముందు వరకు కూడా సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

4 / 5
రైలు బయలుదేరే ముందు కూడా టికెట్లను బుక్‌ చేసుకోవాలని ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ-టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. అలాగే టికెట్‌ కోసం రైల్వే స్టేషన్‌లలోని కౌంటర్లను కూడా సంప్రదించవచ్చు.

5 / 5
 అలాగే బుకింగ్‌ చేసుకునే ముందు సీటు అందుబాటులో ఉందో లేదో కూడా చెక్‌ చేసుకోవచ్చు. చెక్ చేసే సమయంలో కరెంట్ అవైలబుల్ అనే స్టేటస్ కనిపిస్తే ఆ సీటు కరెంట్ బుకింగ్ కోసం అందుబాటులో ఉందని అర్థం. ఈ టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఎలాంటింఅదనపు ఛార్జీలు ఉండవు. సాధారణ టికెట్ ధరనే వర్తిస్తుంది. స్లీపర్, ఏసీ వంటి అన్ని క్లాసులలోనూ ఈ సౌకర్యం ఉంటుంది.