
ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. వాటిని ముందస్తుగా గమనించి పనులు చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మీరు మార్చి 31లోపు ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేయకుంటే, మీకు ఇంకా సమయం ఉంది. మీరు వెంటనే ఈ పని చేయాలి.

మీరు 31వ తేదీలోగా డబ్బును డిపాజిట్ చేయకపోతే మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనితో పాటు, మీ ఖాతా కూడా మూసివేయబడవచ్చు. ముందస్తుగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం.. పీపీఎఫ్ ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఖాతాలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. మీరు కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే, మీ పీపీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుందని గుర్తించుకోండి.

నిలిచిపోయిన ఖాతా పునరుద్దరించవచ్చా?: మీరు మీ క్లోజ్డ్ పీపీఎఫ్ ఖాతాను పునఃప్రారంభించవచ్చు. కానీ దీని కోసం మీరు ప్రతి సంవత్సరం రూ. 50 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా, కనీస డిపాజిట్ కూడా చేయవలసి ఉంటుంది.

మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో కనీసం రూ. 250 పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మీరు ఈ పెట్టుబడిని చేయకపోతే, మీరు సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాలి.