6 గంటల్లో రూ.6 లక్షల కోట్లు ఆవిరి! స్టాక్‌ మార్కెట్‌ ఇంతలా ఎందుకు కుప్పకూలింది?

Updated on: Feb 19, 2026 | 3:56 PM

భారత స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనం లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపదను హరించింది. లాభాల బుకింగ్, అమెరికా ఫెడ్ రిజర్వ్ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు.

1 / 5
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 1,100 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 50 రోజువారీ కనిష్టం 25,567.75కి చేరింది. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగి పెట్టుబడిదారులు సుమారు రూ.6 లక్షల కోట్లు కోల్పోయారు. మార్కెట్ ఇంతలా ఎందుకు పడిపోయింది ఇప్పుడు చూద్దాం..

2 / 5
లాభాల బుకింగ్ ప్రభావం.. ఇటీవల వరుసగా లాభాలు నమోదు చేసిన తర్వాత ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. బడ్జెట్ RBI విధానం త్రైమాసిక ఫలితాల ప్రభావం తగ్గడంతో కొత్త పాజిటివ్ ట్రిగ్గర్లు లేకపోవడం మార్కెట్‌ను బలహీనపరిచింది.

3 / 5
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనిశ్చితి.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన కలిగించింది. రేట్లు ఎక్కువ కాలం ఉన్నతంగా ఉంటే విదేశీ పెట్టుబడులు ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.

4 / 5
భౌగోళిక ఉద్రిక్తతలు.. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వార్తలు పెట్టుబడిదారుల్లో జాగ్రత్త భావన పెంచాయి. అనిశ్చితి పెరిగితే మార్కెట్లు సాధారణంగా రిస్క్ తగ్గించే దిశగా కదులుతాయి.

5 / 5
పెరిగిన ముడి చమురు ధరలు.. బ్రెంట్, WTI క్రూడ్ ధరలు పెరగడం భారత్‌కు ప్రతికూల సంకేతం. దేశం పెద్ద చమురు దిగుమతిదారుగా ఉండటంతో రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతుంది.

Follow Us