
Income Tax Free: ప్రతి సంవత్సరం భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఆదాయ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందిస్తారు. జీతం, వ్యాపారం, స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి ద్వారా సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆదాయంపై సున్నా పన్ను విధించే ఒక రాష్ట్రం కూడా ఉందని మీకు తెలుసా? ఈ రాష్ట్రంలోని స్థానిక నివాసితులు తమ ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు.

ఈ రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఉత్తరాన ఉంది. విశేషం ఏమిటంటే భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం 'సిక్కిం'. సిక్కిం భారతదేశంలో విలీనం అయినప్పుడు సిక్కిం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించకూడదనే షరతును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ప్రకారం 1975 సంవత్సరంలో సిక్కిం ప్రజలకు పన్ను మినహాయింపు కల్పించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే సిక్కింలోని ప్రజలు కోట్లాది రూపాయలు సంపాదించినా, వారు ఒక్క రూపాయి కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు.

సిక్కిం ప్రజలు సెక్యూరిటీలు, డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించరట. సిక్కింలోని ఈ పన్ను రహిత విధానం అందరికీ అనుకుంటే పొరపాటే. ఈ మినహాయింపు 1961వ సంవత్సరం నాటి 'సిక్కిం సబ్జెక్ట్ రెగ్యులేషన్'లో నమోదు చేసుకున్న వారికి లేదా వారి వారసులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోండి.

సిక్కిం స్థానిక నివాసులు కానివారు లేదా ఆ తర్వాత అక్కడికి వచ్చి నివసించడం ప్రారంభించిన వారు పన్ను చెల్లించాలి. ఈ కారణంగానే, ఒక వ్యక్తి సిక్కింలో నివాసి కాకుండా అక్కడ పనిచేస్తుంటే, అతను భారతదేశంలోని మిగతా వారిలాగే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

భారతదేశంలో స్థానిక నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం సిక్కిం. ఈ విధానం దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ అందుబాటులో లేదు. అయితే సిక్కింలో జీఎస్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు వంటి ఇతర రకాల పన్నులు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక మినహాయింపు కారణంగా సిక్కిం పరిపాలనాపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నిలిచింది. భారతదేశంలో 1961 ఆదాయపు పన్ను చట్టం కింద పన్నుల చట్టం అమలు చేయబడింది. దీని ప్రకారం ప్రతి భారతీయ నివాసి తన ఆదాయంపై పన్ను చెల్లించాలి.